గత కొంతకాలంగా చర్చల్లో నలుగుతున్న జమిలీ బిల్లును ఎట్టకేలకు నేడు లోక్ సభలో ప్రవేశపెట్టడంతో పార్టీలపరంగా త్వరలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలు బిల్లుకు మద్దతు తెలుపుతున్నాయా లేదా వ్యతిరేకిస్తున్నాయా అనే అంశంపై పూర్తిగా ఒక క్లారిటీకి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏపీలోని వైసీపీ అప్పుడే జమిలి ఎన్నికలపై ఒక నిర్ణయానికి వచ్చి మద్దతు తెలిపింది.  ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కాక బయటి పార్టీల్లో మద్దతు ఇచ్చిన పార్టీ వైసీపీ మాత్రమే.

విచిత్రం ఏమిటంటే... ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని జగన్ రెడ్డి గగ్గోలు పెట్టి ఢిల్లీ వెళ్లి ధర్నా నిర్వహిస్తే ఆయనకు మద్దతు పలికింది ఇండియా కూటమిలోని పార్టీలే. కానీ జగన్ మాత్రం ఎప్పుడూ ఆ పార్టీలకు మద్దతుగా ఉండేందుకు ప్రయత్నించడం లేదు. జమిలీ ఎన్నికల విషయంలో మద్దతుగా ఉండవద్దని ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు విజయసాయిరెడ్డితో మాట్లాడినా ఇప్పుడు ప్రయోజనం లేకపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. 

తమ పార్టీ అధినేతకు బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి ఇప్పుడిప్పుడే లేదని వైసీపీలోని ఓ వర్గం చెబుతోంది. పూర్తి స్థాయిలో బయటకు వచ్చి పోరాటానికి సిద్దమయినప్పుడు మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా మట్లాడతారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే.. వక్ఫ్ బిల్లుకు కూడా వైసీపీ మద్దతు ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ఒక వేళ మద్దతు ప్రకటించకపోతే కనీసం వాకౌట్ అయినా చేస్తారు కానీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితి ఉండదని చెబుతున్నారు.

ఇక జమిలీ ఎన్నికల విషయానికొస్తే.. ఆ ఎన్నికలు ముందుగా వచ్చినా.. వెనుక వచ్చినా.. ఎప్పుడు వచ్చినా వైసీపీకి మద్దతివ్వక తప్పని పరిస్థితి నెలకొంది. 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయమని తమ పార్టీ నేతలకు విజయసాయిరెడ్డి చెబుతూ వస్తున్నారు. ఆయన మాటల్ని ఎవరూ నమ్మకపోయినా … తాము పార్లమెంట్ లో అందుకే మద్దతిస్తున్నామని చెప్పే అవకాశం ఉంది. నిజానికి జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఎన్డీఏ కూటమిలోని కాకుండా ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం సపోర్టు చేస్తోంది. దీని వెనుక మతలబు ఏమిటోనని సర్వత్రా చర్చ జరుగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos