ఏపీ, తెలంగాణ భౌగోళికంగా రెండు వేర్వేరు రాష్ట్రాలు అయినప్పటికీ... రాజకీయంగా, సంస్కృతీ సంప్రదాయాల పరంగా, మానసిక భావోద్వేగాల పరంగా చాలావరకూ ఒకేతాను వస్త్రంలా కలిసే ఉంటాయి. ఇటీవల తెలంగాణలో జరగిన ఎన్నికలు... వెలువడిన ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశాలుగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్...  బీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చినచోట విజయం సాధించగా, సిట్టింగులకు అవకాశం ఇచ్చిన చోట ఆ పార్టీ ఘోర ఓటమిపాలైంది. సిట్టింగుల పై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ కు తీవ్రమైన నష్టం చేసింది. ఇక.. త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగనున్న క్రమంలో తెలంగాణ పరిణామాల క్రమంలో... సీఎం జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడుతున్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని సీఎం జగన్ భావిస్తున్నారని తాజా పరిణామాలతో తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి గ్రాఫ్ ఏ విధంగా ఉందనేది తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా గుర్తిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ లను మార్చేందుకు రెడీ అయ్యారు. ఇటీవల మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డిల రాజీనామాల వ్యవహారం వల్ల బయట పబ్లిక్ లో కూడా ఇదే టాక్ కొనసాగుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న క్రమంలో మొత్తం 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను మారుస్తూ వైసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చింది. మరోవైపు కొత్త ఇన్ ఛార్జిల నియామకాలతో వైసీపీ లో మొదలైన అలజడిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు టీడీపీ నాయకులు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీ పెద్దలకు అర్థమయ్యిందని... ఆ భయంతోనే అభ్యర్థులను మారుస్తున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ నూతన ఇన్ ఛార్జిల నియామకంపై రియాక్ట్ అయ్యారు. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులను కాదు కదా ... స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడిని మార్చినా గెలుపు అసాధ్యమని...  వైసీపీకి అధికారం ఇక మూడునెలలే అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. మరో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కూడా స్పందించారు. మీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు డిసైడ్ అయిన తరువాత.....మీరు ఎంతమందిని మార్చినా ఫలితం సున్నా... ప్రజా వ్యతిరేకత ఉందని అభ్యర్థులను మార్చుకుంటూ పోతే...పులివెందులతో సహా మొత్తం 151 మందిని మార్చాల్సిందే అని ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. మరో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. నాలుగున్నరేళ్లుగా బీసీలను అన్నిరకాలుగా హింసించిన జగన్ కు బీసీలపై ఇంకా కసి చల్లారలేదని విమర్శించారు. ప్రశాంత్ కిశోర్ చిట్టా ప్రకారం వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయే సీట్లను బీసీలకు కట్టబెట్టి... బీసీలను బలిపశువులను చేయాలని చూస్తున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. మొత్తానికి వైసీపీ కొత్త ఇన్ ఛార్జిలను మారుస్తున్న క్రమంలో ఆ పార్టీకి ఎలాంటి ఫలితాలు వెలువడతాయన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos