న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను ఆహార ప్రాసెసింగ్ రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్‌తో కలిసి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoFPI) కార్యదర్శి శ్రీ అవినాష్ ప్రకాశ్ జోషి, సంయుక్త కార్యదర్శి శ్రీ దేవేష్ దేవల్ లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME) అమలును వేగవంతం చేయడం, మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే లక్ష్యంతో మంత్రి కొండపల్లి కొన్ని కీలక ప్రతిపాదనలను కేంద్ర కార్యదర్శి ముందు ఉంచారు. స్త్రీ నిధి ద్వారా PMFME పథకం అమలుపై కేంద్ర కార్యదర్శితో కీలక చర్చలు జరపడంతో పాటు స్త్రీ నిధి రుణాలతో ఏర్పాటు చేసే పీఎంఎఫ్ఎంఈ (PMFME) యూనిట్ల సబ్సిడీ మొత్తాన్ని నేరుగా 'స్త్రీ నిధి' ఖాతాకే విడుదల చేయాలని కోరారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (AIF) కింద వాణిజ్య బ్యాంకులకు ఇస్తున్న తరహాలోనే పీఎంఎఫ్ఎంఈ పథకం కింద స్త్రీ నిధి ద్వారా SHG మహిళలకు అందించే రుణాలకు కూడా వడ్డీ రాయితీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్గదర్శకత్వం, హ్యాండ్‌హోల్డింగ్ సేవలు అందించేందుకు జిల్లా, మండల సమాఖ్యలను PMFME జిల్లా వనరుల సంస్థలుగా (DROs) గుర్తించాలని మంత్రి చేసిన ప్రతిపాదనలపై కేంద్ర కార్యదర్శి అవినాష్ ప్రకాశ్ జోషి, సంయుక్త కార్యదర్శి దేవేష్ దేవల్ సానుకూలంగా స్పందించారు. అలాగే స్త్రీ నిధి ఖాతాకు సబ్సిడీ విడుదల, రుణాలకు వడ్డీ రాయితీ అంశాలను ప్రాధాన్యతతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర అధికారులతో చర్చలు విజయవంతం కావడం పట్ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి లభించే ఈ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ SHG మహిళలకు పీఎంఎఫ్ఎంఈ పథకం మరింత చేరువవుతుందని, ఆహార ప్రాసెసింగ్ రంగంలో మహిళల ఉపాధి, ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos