ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే విడుదలైన పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేసినట్లు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం ఉగాది పండగ మార్చి 20వ తేదీన రావడంతో, ఆ రోజున నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. దీంతో ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20కి బదులుగా మార్చి 21వ తేదీన నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పును విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు గమనించాలని సూచించింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షల సమయాల్లో ఎలాంటి మార్పు లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
మారిన EXAM టైమ్‌టేబుల్ ప్రకారం పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
మార్చి 16 - ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 18 - సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 - ఇంగ్లిష్ (మార్చి 20 నుంచి మారింది)
మార్చి 23 - మ్యాథమెటిక్స్
మార్చి 25 - ఫిజికల్ సైన్స్
మార్చి 28 - బయాలజికల్ సైన్స్
మార్చి 30 - సోషల్ స్టడీస్
విద్యార్థులు తాజా షెడ్యూల్‌ను అనుసరించి తమ రివిజన్ ప్లాన్ సవరించుకోవాలని, ఎలాంటి గందరగోళానికి లోనుకాకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos