అమరావతి : కష్టపడి చదివి, క్రీడల్లో ప్రతిభ చాటి, నిబంధనల ప్రకారం మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయడం సరికాదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన, విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే నిరసన తెలియజేయవచ్చు. ఆధారాలుంటే సంబంధిత సంస్థల ముందు ఉంచవచ్చు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. కానీ కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను ‘ఫేక్’ అంటూ అవమానించడం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సమంజసం కాదు. విజయవాడలో ఉపాధ్యాయులపై దాడి జరిగిందన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. ఘటనలో ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

విజయవాడ ఘటన బాధాకరం..

శాప్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటనలు తీవ్ర ఆవేదన కలిగించాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మమ్మల్ని ఎందుకు ఫేక్ అంటున్నారని ఉపాధ్యాయులు వైసీపీ నేత‌ల‌ను ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పాలి. రాజకీయంగా విభేదించవచ్చు, వాదించవచ్చు. కానీ అది భౌతిక ఘర్షణలకు దారితీయకూడదు. ముఖ్యంగా సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే గురువులు రాజకీయ ఘర్షణల్లో బాధితులుగా మారే పరిస్థితి రావడం బాధాకరం. మాజీ సైనికుడిగా దేశానికి సేవ చేసి, అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన వ్యక్తి కూడా ఈ వివాదంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న విషయం మరింత ఆవేదన కలిగిస్తోంది అని మంత్రి పేర్కొన్నారు. మేము చదువుకున్నాం, కష్టపడ్డాం, మా ఉద్యోగం మా కష్టార్జితం అని వారు చెబుతున్నప్పుడు వారి వాదనను కూడా వినాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందన్నారు.

మెగా డీఎస్సీ అంటే పారదర్శకతకు చిరునామా.. 

మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ లేనిపోని అనుమానాలు సృష్టించడం తగదని అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రాధాన్య హామీల్లో మెగా డీఎస్సీ ఒకటని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో 148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. నోటిఫికేషన్ నుంచి పరీక్షలు, ఆన్సర్ కీలు, మెరిట్ జాబితాలు, గ్రీవెన్సులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, తుది ఎంపిక వరకు నిర్దేశిత విధానాలను అనుసరించామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల ట్రాక్ రికార్డు ప్రజల ముందుంది. గతంలో అనేక డీఎస్సీలు, ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించాం. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా 14 సార్లు డీఎస్సీ ప్రక్రియలు చేపట్టిన అనుభవం ఉంది. నియామక ప్రక్రియల్లో పారదర్శకత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అని మంత్రి పేర్కొన్నారు.

స్పోర్ట్స్ కోటా అంటే ప్రతిభకు ఇచ్చే గుర్తింపు..

స్పోర్ట్స్ కోటాపై వైసీపీ ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తుంద‌ని మంత్రి ఆరోపించారు. క్రీడల్లో ప్రతిభ చూపి, గుర్తింపు పొందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కల్పించడం కొత్త విధానం కాదన్నారు. గత ప్రభుత్వాల కాలంలో సంబంధిత వ్యవస్థలే క్రీడాకారులకు సర్టిఫికెట్లు ఇచ్చాయి. ఇప్పుడు అదే సర్టిఫికెట్లతో నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన వారందరినీ ‘ఫేక్’ అని ముద్ర వేయడం ఎలా సమంజసం? ఏదైనా నిర్దిష్ట సర్టిఫికెట్‌పై అనుమానం ఉంటే దానిని పరిశీలించవచ్చు. తప్పు ఉంటే చర్య తీసుకోవచ్చు. కానీ మొత్తం స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల గౌరవాన్ని దెబ్బతీయడం సరికాదు అని అచ్చెన్నాయుడు అన్నారు. బ్రిడ్జ్ క్రీడను చూపిస్తూ జరుగుతున్న ప్రచారంపైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బ్రిడ్జ్ అంశాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం నియామక ప్రక్రియను అనుమానాస్పదంగా చిత్రీకరించడాన్ని ఆయన తప్పుబట్టారు.

గ్రూప్‌-1 మూల్యాంకనంపై సిట్‌ నివేదిక అంశాలకు జగన్‌ సమాధానం చెప్పాలి..

గత ప్రభుత్వ హయాంలో జరిగిన APPSC గ్రూప్-1 ప్రధాన పరీక్షల మూల్యాంకన ప్రక్రియపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పరిశీలనలో బయటపడిన విధానపరమైన లోపాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో ముడిపడిన అత్యున్నత స్థాయి నియామక ప్రక్రియలో పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తితే వాటికి అప్పటి ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. 2018 డిసెంబర్ 31న గ్రూప్-1 నియామకాలకు నోటిఫికేషన్ జారీ కాగా, 2020 డిసెంబర్ 14 నుంచి 20 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయని తెలిపారు. 6,807 మంది అభ్యర్థులు ఏడు పేపర్లను పూర్తి చేశారని, అనంతరం చేపట్టిన మూల్యాంకన ప్రక్రియ వివాదాలకు దారితీసిందన్నారు. SIT పరిశీలించిన మొత్తం 736 మంది అభ్యర్థులకు సంబంధించిన రికార్డుల్లో 718 valuation slipsలో corrections లేదా alterations గుర్తించినట్లు వెల్లడైందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ దశల్లో signature mismatches, overwriting, correction fluid వినియోగం వంటి అంశాలను కూడా దర్యాప్తు గుర్తించినట్లు వార్తా నివేదికలు పేర్కొంటున్నాయన్నారు. 736 రికార్డుల్లో 718 valuation slipsలో దిద్దుబాట్లు కనిపించడానికి కారణమేంటి? ఇంత పెద్ద సంఖ్యలో corrections ఎందుకు చేయాల్సి వచ్చింది? వాటిని ఎవరు చేశారు? ఏ నిబంధనల ప్రకారం చేశారు? ఈ ప్రశ్నలకు జ‌గన్ సమాధానం చెప్పాలి అని అచ్చెన్నాయుడు అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Sports Teachers Protest Against YSRCP | Mega DSC | స్పోర్ట్స్ టీచర్ల పోరాటం | Amaravati Galam

తాజా వార్తలు

18-19-11-0911.jpg

నిరుపేదల వైద్యానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి అండ.. మెరుగైన వైద్యం కోసం బాధితులకు ఎల్‌ఓసీ పత్రాల అందజేత
2026-09-21 Time: 06:19:11

18-02-43-0943.jpeg

శాప్ కార్యాలయంలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గం.. మెగా డీఎస్సీపై ఉద్దేశపూర్వకంగా జగన్ దుష్ప్రచారం.. మంత్రి కొలుసు పార్థసారధి
2026-09-21 Time: 06:02:43

17-51-57-0957.jpg

పచ్చదనం పరిమళం..పిఠాపురంలో నగర వనాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
2026-09-21 Time: 05:51:57

17-16-45-0945.jpg

గురువుల కష్టార్జితంపై ‘ఫేక్’ ముద్ర వేస్తారా? ప్రతి ఆరోపణకూ ఆధారాలతో సమాధానం చెబుతాం.. విజయవాడ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్
2026-09-21 Time: 05:16:45

17-04-22-0922.jpg

స్వర్ణ కుప్పం దిశగా అడుగులు.. పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం
2026-09-21 Time: 05:04:22

Related Videos