ఢిల్లీ : రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న వివిధ అంశాలను సీఎం చంద్రబాబు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై చర్చ..
దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో గోదావరి–కావేరి నదుల అనుసంధానం అంశంపై చర్చించిన విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ అంశంపై కేంద్ర స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కోరినట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా చంద్రబాబు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మరికొందరు కేంద్ర మంత్రులతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos