కడప : కడపలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సందర్భంగా కోటిరెడ్డి సర్కిల్‌ నుంచి బహిరంగ సభ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి,కె. రామకృష్ణ,  మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి, కేంద్రం నుంచి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య మాట్లాడుతూ రాయలసీమతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్లీనరీలో ప్రజా సమస్యలు, రైతాంగ సంక్షోభం, కార్మికుల సమస్యలు, సామాజిక భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు నాయకులు తెలిపారు.

Related Videos