ఎన్టీఆర్ వర్ధంతి రోజున నందమూరి కుటుంబంలో విభేధాలు బయటపడ్డాయి. పెద్ద ఎన్టీరామారావు చనిపోయి ఈ రోజు కు 27 సంవత్సరాలు పూర్తి అయిన క్రమంలో 27వ వర్థంతి రోజున జూనియర్ ఎన్టీఆర్ కు ఘోర అవమానం జరిగిందని ఆయన ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగించమనడంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. నందమూరి తారక రామారావు వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లతో వారి ఫ్యాన్స్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆనంతరం అక్కడికి వచ్చిన నందమూరి బాలకృష్ణ వాటిని చూసి ఫైర్ అయ్యారని తెలుస్తోంది. తండ్రికి నివాళులు అర్పించిన బాలయ్య.. వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. దీంతో బాలకృష్ణ ఆదేశంతో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లతో ఉన్న ఫ్లెక్సీలను, బ్యానర్లను వెంటేనే తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలయ్య ఆదేశంతో రెచ్చిపోయిన బాలయ్య ఫ్యాన్స్... ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద విరుచుకుపడ్డారని తెలుస్తోంది. బాలకృష్ణ అలా చెప్పడంతో ఇప్పుడు నెట్టింట ఈ న్యూస్ వైరల్ గా మారింది. బాలయ్య.. ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమన్నారంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాగా ఈ వివాదంపైన మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ కామెంట్స్ చేయడంతో ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆయన చంద్రబాబు, బాలకృష్ణపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ... జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే తారక్ కు ఏమైనా నష్టం జరిగిందా అని ప్రశ్నించారు. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. ప్లెక్సీలను తొలగిస్తే ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబును ఎవరూ పట్టించుకోరన్నారు. మొత్తానికి ఫ్లెక్సీల యవ్వారం కాస్త రాజకీయ రంగు పులుముకోవడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos