అమరావతి: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. 2026, జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. రాష్ట్ర అభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహద పడుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

16-17-06-0506.jpg

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు..!రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం చంద్రబాబు
2026-05-05 Time: 04:17:06

12-32-49-0449.jpg

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్.. ఆర్టీజీ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
2026-04-30 Time: 12:32:49

10-50-59-0459.jpg

మీ త్యాగాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను.. టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార ముగింపు సభలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ 
2026-04-30 Time: 10:50:59

14-33-31-0431.jpg

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు.. అభినందనలు తెలిపిన పలువురు నేతలు
2026-04-29 Time: 02:33:31

14-26-40-0440.jpg

పెట్టుబడుల్లోనే కాదు... ప్రాజెక్టుల గ్రౌండింగులోనూ ఏపీనే నెంబర్-1.. విశాఖ గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు 
2026-04-28 Time: 02:26:40

Related Videos