జనసేన అధినేత పవన్ కల్యాన్ కు కాపు సంక్షేమ సేన ప్రెసిడెంట్, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. ఇందులో పవన్ కల్యాణ్ కు పలు ప్రశ్నలు సంధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ఏపీకి సీఎంగా ఉంటే ... మరి జన సైనికుల కలలు ఏం కావాలని నిలదీశారు. మీరు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి నీతివంతమైన పరిపాలన అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి ఏమని సమాధానం చెబుతారని... ఇక 80 శాతం జనాభా ఉన్న బడుగు, బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడని ప్రశ్నించారు.  చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి.. ఈ నిర్ణయంలో రెండవమాట లేదు.. “అనుభవస్తుని నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి” అని పవన్ కళ్యాణ్‌ కూడా అనేకసార్లు ప్రకటించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అనౌన్స్ చేశారు కదా ... లోకేష్‌ ఆశిన్తున్నట్లుగా చంద్రబాబునే పూర్తి కాలం ముఖ్యమంత్రిగా చేయటానికి మీ ఆమోదం ఉందా... అని హరిరామ జోగయ్య ... పవన్ ను సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుండి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటు వంటి రెండే రెండు కుల నాయకులు రాజ్యమేలుతున్నారని అన్నారు. 'మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకొక దారి చూపిస్తారని... నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏమిటనే ప్రశ్న సంధించారు. 'ఈ ప్రశ్షలన్నిటికి మీ నుంచి జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏమిటో జన సైనికులందరికి అర్ధమయ్యేలా చెప్పాల్సిందిగా కోరుచున్నాము' అంటూ ఆయన పవన్ కు లేఖ రాశారు. కాగా... నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో... టీడీపీ-జనసేన పార్టీల పొత్తులో ముఖ్యమంత్రి ఎవరని ప్రశ్నిస్తే... చంద్రబాబే సీఎం అవుతారని లోకేష్ వ్యాఖ్యానించారు.. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన హరిరామజోగయ్య .. వెంటనే లేఖ పవన్ కు పలు ప్రశ్నలను సంధిస్తూ లేఖ ప్రస్తావించారు. సీఎం పదవిపై లోకేష్ వెల్లడించిన కామెంట్స్ మీరు సమాధానం ఇవ్వండంటూ హరిరామ జోగయ్య ... పవన్ ను ఘాటుగా ప్రశ్నించారు. జోగయ్య ప్రశ్నలకు పవన్ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పడు సర్వత్రా ఉత్కంగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos