సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): రష్యాకు చెందిన ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్ – ఎం (Novostal-M) సంస్థ చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో (Mr. Ivan Demchenko)తో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. వేగవంతమైన పర్యావరణ అనుమతులు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మౌలిక సదుపాయాల మార్కెట్ మద్దతుతో దూసుకుపోతున్న భారత్ లో  ఉన్నత శ్రేణి రీబార్, వైర్ రాడ్‌లను తయారుచేసే ఒక అత్యాధునిక EAF (Electric Arc Furnace) స్టీల్ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టాల‌ని నారా లోకేష్ విజ్ఞ‌ప్తి చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటీలో తక్షణ రైల్వే సైడింగ్ కనెక్టివిటీతో ఒక స్ట్రక్చరల్ సెక్షన్, రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లును ఏర్పాటుచేయాల‌ని,  చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ పరిధిలో ప్రాంతీయ ఆటోమోటివ్, షిప్‌బిల్డింగ్ పరిశ్రమలకు నేరుగా మెటీరియల్ సరఫరా చేసే ఒక ప్రత్యేకమైన హార్డ్‌వేర్ గాల్వనైజ్డ్ వైర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేప‌ట్టాల‌ని కోరారు. నోవోస్టల్-ఎమ్ సప్లయ్ చైన్ తో ప్రత్యేకమైన వాటర్‌ఫ్రంట్ బెర్త్‌లతో కూడిన ముడి పదార్థాల లాజిస్టిక్స్ హబ్‌ను అభివృద్ధి చేయడానికి ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటుకు చొర‌వ చూపాల‌ని ప్ర‌తిపాదించారు.  భారత్ లోని సౌర, పవన విద్యుత్ కారిడార్లతో అనుసంధానిస్తూ... లో-కర్బన్ ఉక్కు తయారీలో సహకార భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

నోవోస్టల్ – ఎం (Novostal-M) చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో మాట్లాడుతూ...  స్టీల్ ప్రొడక్షన్, హోల్ సేల్ మెటల్ ఓర్ వ్యాపారంలో నిమగ్నమైన Novostal-M సంస్థ ఏటా 2.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిచేసి, 60కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంద‌న్నారు. తమ సంస్థ మార్కెట్ విస్తరణలో భాగంగా భారతదేశంలోని నిర్మాణ, ఉత్పాదక రంగాలకు సెమీ-ఫినిష్డ్, లాంగ్ స్టీల్ ఉత్పత్తులను భారీ పరిమాణంలో ఎగుమతులపై దృష్టిసారించినట్లు చెప్పారు.  మెటలర్జికల్ పోర్ట్‌ఫోలియో, పారిశ్రామిక ఫ్యాబ్రికేటర్లకు ప్రీమియం స్టీల్ బిల్లెట్లు, స్ట్రక్చరల్ రీబార్, హై-స్పీడ్ వైర్ రాడ్లు, ప్రత్యేక వెల్డింగ్ వైర్లను తాము సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.  మౌలిక సదుపాయాల సరఫరా వ్యూహంలో భాగంగా జాతీయ రైల్వే, హైవే ప్రాజెక్టుల్లో ముడి పదార్థాల కొరతను నివారించడానికి లాంగ్ స్టీల్, షేప్డ్ రోల్డ్ ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపారు. ముంబై, చెన్నై వంటి కీలక జలరవాణా మార్గాల్లో ఇంపోర్ట్ క్లియరెన్సులు, బల్క్ అమ్మకాలను డిస్ట్రిబ్యూషన్ నోడ్స్ సమన్వయం చేస్తాయని తెలిపారు. ఏపీ మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని డెమ్చెంకో చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

14-47-28-0628.jpg

శ్రీసిటీలో రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లు ఏర్పాటు చేయండి.. నోవోస్టల్ ఎం చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో కు  మంత్రి నారా లోకేష్ విజ్ఞ‌ప్తి
2026-06-04 Time: 02:47:28

17-11-24-0624.jpg

పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ ల నిర్మాణంలో భాగస్వామ్యం వహించండి.. రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఓ ఇల్యా కోసిహ్ తో మంత్రి లోకేష్ భేటీ
2026-06-03 Time: 05:11:24

17-08-34-0634.jpg

హెల్తీ సిటిజన్స్‌తోనే వెల్తీ నేషన్ నిర్మాణం.. లలితా పీవీఎస్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు 
2026-06-03 Time: 05:08:34

14-52-41-0641.jpg

విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటుచేయండి..  ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ
2026-06-01 Time: 02:52:41

14-06-40-0540.jpg

ఇది మా సంకల్పం... మా బాధ్యత...మా కమిట్ మెంట్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారా లోకేష్
2026-05-27 Time: 02:06:40

Related Videos