అమరావతి:  ఈ నెల 20 తేదీన కోస్తాంధ్రను తాకనున్న తుఫానుపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో తీవ్ర వాయుగుండం ప్రస్తుత పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. దీని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. ఆర్నబ్ తరహాలోనే ఈ తుఫాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.  రానున్న తుఫాను కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లా సహా వివిధ ప్రాంతాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముందుగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపటంతో పాటు విద్యుత్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేలా సిబ్బందిని సిద్దంగా ఉంచుకోవాలని సీఎం సూచించారు. అలాగే భారీ వర్షాల వల్ల వస్తున్న వరద ప్రవాహాలను రిజర్వాయర్లకు మళ్లించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

15-30-12-1112.jpg

20 తేదీన కోస్తాంధ్రను తాకనున్న తీవ్ర తుఫాను.. భారీ వర్ష సూచన.. ముందస్తు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు
2026-11-16 Time: 03:30:12

15-40-51-1151.jpeg

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో రాష్ట్ర ప్రభుత్వం.. పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ కు సీఎం చంద్రబాబు ఆహ్వానం
2026-11-13 Time: 03:40:51

17-45-32-1032.jpg

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశం
2026-10-08 Time: 05:45:32

08-10-2026-11-23-58627.jpg

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్..  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
2026-10-08 Time: 04:47:11

16-39-17-1017.jpg

అమరావతి ORR కు సహకారం అందించండి.. పోలవరం వద్ద ఐకానిక్ వంతెన ప్రాజెక్టు చేపట్టండి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి   సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
2026-10-08 Time: 04:39:17

Related Videos