విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక వేత్తలకు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వేగంగా అనుమతులివ్వడానికి యంత్రాంగం పూర్తిగా సహకారం అందిస్తుందని వెల్లడించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఆర్పీఎస్ జీ గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందడానికి లీడర్షిప్ బ్యాండ్ విడ్త్ కీలకమని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ సేవలు, క్రీడలు, వస్త్రాలు, ఫ్యాషన్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నట్టు వివరించారు. పుర్వా గ్రీన్ పవర్ ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 349.8 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు, సుమారు రూ.3,286 కోట్ల పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో... సౌర విద్యుత్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ , గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో అదనపు పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం విజయవాడలోని మేధా ఐటీ టవర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు చెందిన ఫస్ట్‌సోర్స్ సంస్థను విశాఖపట్నం, తిరుపతికి విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందిస్తూనే సామాజిక బాధ్యతగా పీ4 అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టామని.. పేదలకు చేయూత అందించేందుకు ముందుకు రావాలని ఆర్పీఎస్జీ గ్రూప్ ను సీఎం కోరారు. 

ఏపీలో అందే సహకారం ఇంకెక్కడా లేదు : శాశ్వత్ గోయెంకా

పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు ఏపీలో అందుతున్న సహకారం దేశంలో ఇంకెక్కడా లేదని.. ఈ అంశంలో ఏపీ రోల్ మోడల్ అని ఆర్పీఎస్జీ గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకా ముఖ్యమంత్రితో అన్నారు. రాష్ట్ర వనరులు, పెట్టుబడి అవకాశాలపై సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజెంటేషన్ అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. ఏపీలో పెట్టుబడులకు, తమ కార్యకలాపాల విస్తరణకు సిద్దంగా ఉన్నామని గోయెంకా వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos