అమరావతి: పార్లమెంట్ లో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి... మన స్త్రీశక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. ఇప్పుడు ఒక ప్రతిపాదన చేస్తున్నాను. పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా, అవ్వకపోయినా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి... వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకు ఇవ్వాలి... ఈ పవిత్ర మహానాడు వేదిక నుండి తాను ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, యువనేత నారా లోకేష్ ప్రకటించారు. యువనేత లోకేష్ ప్రవేశపెట్టిన ఈ చారిత్మాత్మక తీర్మానంతో మహానాడు వేదిక మారుమోగింది. మహానాడు ప్రారంభం సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% సీట్లను కేటాయించాలి. ఇది కేవలం ఒక నినాదంగా కాదు.. భారతదేశ భవిష్యత్తు పట్ల ఒక నిబద్ధతగా ఉండాలి. మాకు మరింత మంది మహిళా చట్టసభ సభ్యులు కావాలి… మరింత మంది మహిళా నాయకులు కావాలి… మరింత మంది మహిళా విధాన నిర్ణేతలు కావాలి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును మహిళలు భుజం భుజం కలిపి నడిపిస్తారు. ఇది మా సంకల్పం...ఇది మా బాధ్యత...ఇది మా కమిట్ మెంట్ అని అన్నారు.

టిడిపి మహిళా సాధికారతను విశ్వసిస్తోంది

భారత రాజకీయాల తదుపరి శకం మహిళా నాయకత్వానిదే కావాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం ద్వారా ఎన్డీయే ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. మా దృక్పథం స్పష్టం — మహిళలు కేవలం లబ్ధిదారులుగా మాత్రమే మిగిలిపోకూడదు… మహిళలు నిర్ణయాలు తీసుకునేవారుగా మారాలి. దురదృష్టవశాత్తు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తిరస్కరించి, మహిళా సాధికారతకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించాయి. ఎన్నికల సమయంలో చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడతాయి… కానీ ఎన్నికల తర్వాత మహిళలను మర్చిపోతాయి. కానీ తెలుగుదేశం పార్టీ సూత్రప్రాయంగా, ఆచరణలో మహిళా సాధికారతను విశ్వసిస్తోంది. ఇతరులు మద్దతిచ్చినా, మద్దతు ఇవ్వకపోయినా… పార్లమెంట్ అమలు చేసినా చేయకపోయినా… మనం ముందుండి నడిపించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలను అవమానపరిచేలా మాటలు మాట్లాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు అంటూ మహిళలను తక్కువచేసి మాట్లాడతారు. అలాంటి మాటలు ఎవరూ మాట్లాడకూడదు అని మనం ముందుండి పోరాడాలి. స్కూల్ బుక్స్ లో ఇంటి పనులు చేసే బొమ్మలు అన్నీ మహిళలవే ఉంటే 50 – 50 ఉండాలని ఆదేశించాను. 

హైబ్రిడ్ అయినా టీమ్ -11 కి బ్యాటింగ్ తప్పదు

ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా, హైబ్రిడ్ అయినా మహానాడు మాస్ జాతర సూపర్ హిట్. పసుపు పండుగ మహానాడు. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి — నేను తెలుగు వాడినీ… నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే వేదిక మహానాడు. నేషన్ ఫస్ట్ తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం - మన బాధ్యత. ప్రధాని మోదీ గారు ఇచ్చిన దిశ మనం ఫాలో అవుతున్నాం. నెల్లూరులో భారీగా మహానాడు నిర్వహించాలనుకున్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నాం. మనమే హైబ్రిడ్ మోడల్ అనగానే టీమ్ 11 సంబరాలు చేసుకున్నారంటా. ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11 కి బ్యాటింగ్ తప్పదు.

లెజెండ్... అన్న ఎన్టీఆర్!

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు దేశానికి లెజెండ్. తెలుగువారి ఆత్మ గౌరవం, తెలుగు వారి పౌరుషం ఎన్టీఆర్. సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ ఆయన ట్రెండ్ ఫాలో అవ్వలేదు.. ట్రెండ్ సెట్ చేశారు. ఆయన రికార్డులు బద్దలు కొట్టడం ఎవరివల్లా సాధ్యం కాదు. దేశానికి సంక్షేమం, అభివృద్ధి పరిచయం చేసింది ఎన్టీఆర్. సమాజమే దేవాలయం … ప్రజలే దేవుళ్లని చెప్పిన మాట మన సిద్ధాంతం. 2 రూపాయలకు కిలో బియ్యం, పెన్షన్, ₹50/హార్స్ పవర్ విద్యుత్, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ళు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకం, పటేల్‑పట్వారీ విధానం రద్దు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు వంటివి ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. స్త్రీశక్తిని మొదట గుర్తించింది, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది, మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీ పెట్టింది, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది అన్న ఎన్టీఆర్.

సిబిఎన్ పేరు చెబితే ప్రపంచవ్యాప్తంగా గౌరవం

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మూడు అక్షరాలు చెబితే గౌరవం దక్కుతుంది. ఆ మూడు అక్షరాల బ్రాండ్ సిబిఎన్… ఈ సౌండ్ తాడేపల్లి ప్యాలస్‌కు వినపడాలి.. టీమ్ 11 టీవీలో మహానాడు చూస్తుంది. ఒక్కరితో అయితే పోటీ పడగలం.. కానీ ఆయనలో 25 ఏళ్ళ కుర్రాళ్లు ముగ్గురు ఉన్నారు. ఆయన జెట్ స్పీడ్‌లో వెళ్తుంటారు. ఆయన స్పీడ్ అందుకోవడానికి మనం కష్టపడుతున్నాం. అప్పుడు కియా...ఇప్పుడు ఫైటర్ జెట్స్. అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ. అప్పుడు హైటెక్ సిటీ.. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. అప్పుడు సైబరాబాద్...ఇప్పుడు అమరావతి. భవిష్యత్తును ముందుగానే చూసే విజనరీ మా లీడర్ సిబిఎన్. స్త్రీశక్తిని మహా శక్తిగా మార్చింది మన సిబిఎన్. మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చింది మన సిబిఎన్. డ్వాక్రా ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది మన సిబిఎన్. తన తల్లి పడిన కష్టం మరే తల్లి పడకూడదని దీపం పథకం ప్రవేశపెట్టింది, మహిళలను బస్ కండక్టర్స్ చేసింది మన సిబిఎన్. దేశంలోనే మొదటి మహిళా స్పీకర్‌గా ప్రతిభా భారతిని నియమించింది మన సిబిఎన్. ఎవరైనా మహిళల జోలికు వస్తే అదే వారికి లాస్ట్ డేట్ అని చెప్పిన దమ్మున్న నాయకుడు మన సిబిఎన్. మహిళల జోలికి వెళితే ఏమవుతుందో చూశారుగా… అర్ధమైందా రాజా.

టిడిపిలో కార్యకర్తే అధినేత

తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత. 2019 నుంచి 2024 వరకు పసుపు సైన్యం చేసిన పోరాటం ఒక చరిత్ర. మెడపై కత్తి పెట్టి వారి నాయకుడు పేరు చెప్పమంటే "జై చంద్రబాబు, జై టిడిపి" అని ప్రాణాలు వదిలారు తోట చంద్రయ్య. నామినేషన్ పత్రాలు లాక్కొని, దాడి చేస్తే తొడకొట్టి మీసం మెలేశాడు అంజిరెడ్డి తాత. వైసిపి రౌడీల దాడిలో రక్తం కారుతున్నా చివరి ఓటు పడేవరకు పోలింగ్ బూత్‌లో కూర్చున్నారు మంజుల గారు. వైసిపి గూండాల దాడిలో కన్నుపోయినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడారు చెన్నుపాటి గాంధీ. వీరంతా మనకు స్ఫూర్తి. మన అధినేతను 53 రోజులు అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా రోడ్లపైకి వచ్చారు. అది మన క్రెడిబిలిటీ. కేసులకు వెనకడుగు వేయలేదు, అరెస్టులకు భయపడలేదు. అవతల వైపు ఎవరున్నా మన డైలాగే ఒకటే... తగ్గేదే లే. మనం కొట్టిన దెబ్బకి వై నాట్ 175 కాస్తా టీమ్ 11 అయ్యింది.

రికార్డులు బద్దలుకొట్టాం

2024 ఎన్నికల్లో రికార్డులు బద్దలుకొట్టాం. 94% స్ట్రైక్ రేట్...164 సీట్లు. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు... ప్రజా ప్రభుత్వాన్ని పెద్దఎత్తున ప్రజలు ఆశీర్వదించారు. అన్ని రికార్డులు బద్దలుకొట్టాం. శ్రీకాకుళంలో 10కి పది, విజయనగరంలో 9కి 9, తూర్పుగోదావరిలో 19కి 19, పశ్చిమ గోదావరిలో 15కి 15, కృష్ణాలో 16కి 16, గుంటూరులో 17కి 17, నెల్లూరులో 10కి 10, అనంతపురంలో 14కి 14.. మొత్తం 8 ఉమ్మడి జిల్లాల్లో క్లీన్ స్వీప్. కడపలో కూడా 10కి 7 గెలిచాం. ప్రభుత్వం సూపర్ హిట్... సైకో టీమ్ -11.  ప్రజాప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎవరూ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తున్నాం. 4వేల పెన్షన్, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీతో 16వేల టీచర్ పోస్టుల భర్తీ, 6వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, 10వేల పోస్టులతో జాబ్ క్యాలండర్, చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, మత్స్యకార సేవలో, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, దీపం -2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తున్నాం.

అభివృద్ధి – సంక్షేమంపై చర్చకు నేను రెడీ!

ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ మన విధానం. దేశవ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో ఈరోజు 25శాతం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, ఫైటర్ జెట్ ప్రాజెక్టులు ఏపీకి క్యూకడుతున్నాయి. నేను టీమ్ -11 కెప్టెన్ కి ఒక ఆఫర్ ఇస్తున్నా. సమయం, తేదీ మీరు ఫిక్స్ చేయండి. సంక్షేమం‑అభివృద్ధి పై చర్చకు నేను రెడీ. అభివృద్ధి – సంక్షేమం హడావిడిలో పడి మనం కొన్ని విషయాలు మరచిపోయాం. సైకో హయాంలో బీసీలు, దళితులు, మైనారిటీలపై జరిగిన దాడులను మనం మర్చిపోవద్దు. తన అక్కను ఎందుకు ఏడపించావని అడిగినందుకు బిసి బిడ్ద అమరనాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఫేస్ మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి వైసిపి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారు. మైనారిటీ సోదరుడు అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. వైసిపి నాయకుడు కూతురు కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని అని మిస్బా అనే చెల్లిని వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారు.

మాది గూగుల్... మీది గొడ్డలి

గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది అంట.  మాది గూగుల్ – మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్స్ – మీది ఫ్యాక్షన్. మాది కియా – మీది కిడ్నాప్. బాబాయిని చంపింది గొడ్డలితో కాదా? తల్లిని ఇంటి నుండి బయటకు గెంటింది నిజం కాదా? చెల్లికి అన్యాయం చేసి ఆస్తులు కొట్టేసింది నిజం కాదా? అందుకే గొడ్డలి పార్టీ అంటున్నాం. తెలుగు దేశం పార్టీ సిద్ధాంతాలలో బలమైన పునాది ఉంది. మారుతున్న కాలానికి తగ్గట్టు విధానాల్లో కూడా మార్పు రావాలి. గత మహానాడులో మనం ఆరు సూత్రాలు ప్రకటించాం. మనం చేసే ప్రతి పనిలో మన ఆరు సూత్రాలు గుర్తుండాలి. తెలుగు జాతి విశ్వఖ్యాతి / యువగళం / స్త్రీ శక్తి /పేదల సేవలో – సామాజిక న్యాయం / అన్నదాత కు అండగా / కార్యకర్తే అధినేత. నేను పార్టీలో మార్పుల కోసం ఎక్కువ పోరాడతాను. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థకు తీసుకురావడానికి పెద్ద పోరాటం చేశాను. ముందు ఎవరూ ఒప్పుకోలేదు.. నేను అలిగి ఇంట్లో పడుకోలేదు. అందరిని ఒప్పించి మార్పు చేశాం. టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు అందరూ నన్ను తిట్టుకున్నారు. మీరుచేసే ప్రతి పనిని గుర్తించడానికి మై టిడిపి యాప్ తీసుకువచ్చాం. గ్రామస్థాయి నాయకుడు పొలిట్ బ్యూరో స్థాయికి రావాలి, అప్పుడే పార్టీ బలంగా ఉంటుంది. గజపతి నగరం మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇంఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్ ఇప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులు.

ఫేక్ ప్రాపగాండాను తిప్పికొట్టాలి

నిజం గడప డేట్ ముందు అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంది. బాబాయిని చంపి కత్తి బాబుగారి చేతిలో పెట్టారు. వైసిపి ఫేక్ ప్రొపగాండాను గట్టిగా తిప్పికొట్టాలి. ఇప్పుడు రోజుకో కుట్రతో  వస్తున్నారు. ఇప్పుడు డీఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. సైకో... నీది టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన హిస్టరీ ... నాది స్టాన్‌ఫోర్డ్ హిస్టరీ. టీచర్లను లిక్కర్ షాప్ ముందు నిలబెట్టిన హిస్టరీ నీది... టీచర్లను ట్రైనింగ్ కోసం సింగపూర్ పంపిన హిస్టరీ నాది. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని హిస్టరీ నీది ... 16,347 టీచర్ పోస్టులు ఒక్కసారిగా భర్తీ చేసిన హిస్టరీ నాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెంటర్ చేతిలో పెట్టిన హిస్టరీ నాది ... 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన హిస్టరీ నాది. ఇక నుంచి మనం గేర్ మార్చాలి. మిషన్ మోడ్‌లో పని చేయాలి. ప్రతి ఎన్నికలోనూ మనమే గెలవాలి — అదే మన గోల్. ప్రజల్లోకి వెళ్దాం. త్వ‌రలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. అహంకారం వద్దు. అహంకారం చూపిన వారికి 151 కాస్తా 11 అయింది చూశాం. ప్రజలకు సేవ చేయడం మన ధ్యేయం. మనం అనుకున్నది సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు ముఖ్యం. ఒకే ప్రభుత్వం ఉండటం వల్లే గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయి. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మన బలం. మనకు నమో ఉన్నారు. నమో అంటే నాయుడు, మోడీ. పవనన్న కాంబోతో పోలవరం, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు, అమరావతి, కర్నూల్ హైకోర్టు బెంచ్ సాధించామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos