విజయవాడ :  యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ కృష్ణానదీ తీరాన పవిత్ర సంగంమం వద్ద ఉదయం జరిగిన 'యోగాంధ్ర' కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ , ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సమరం , జేసీ, అధికారులు, పాల్గొన్నారు. ప్రాథమిక సాధన, పాదహస్తాసనం, త్రికోణాసనం, కఠినసాధన, పశ్చిమోత్తాసనం, తాడసనం, చక్రాసనం పలు ఆసనాలను సాధన చేశారు. యోగ సాధకుల రాజధాని అమరావతి లోగోను ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ఒత్తిడి, గుండెపోటు, షుగర్‌ వంటి జీవనశైలి వ్యాధులను నియంత్రించడానికి యోగా ఎంతో అవసరమని పేర్కొన్నారు.భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక అని, శాస్త్రీయంగా ఇది నిరూపితమైందన్నారు. యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చని సూచించారు. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర అవగాహనా కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారీ కార్యక్రమానికి సన్నాహకంగా ఈ ప్రచార కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.

‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే థీమ్‌తో ప్రచార ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందని వివరించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలు, ఇతర శాఖల సమన్వయంతో కార్యాచరణ కోసం ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు.ఈ నెల 21న అమరావతిలో జరిగే భారీ యోగా వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తారని తెలిపారు. ప్రధాని మోదీ గారు యోగాను అంతర్జాతీయ క్యాలెండర్‌లోకి ఎక్కించి ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే యోగాంధ్ర కార్యక్రమం అన్నారు. ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి రోజూ కనీసం అరగంట యోగా చేయాలని ఎమ్మెల్యే సూచించారు. దార్శనికులు, ప్రపంచంలో అత్యంత శక్తివంత నాయకులు మోడీ గారు, చంద్రబాబు గారు రోజూ యోగా చేయబట్టే ఆరోగ్యంగా, చురుగ్గా వుంటున్నారని అన్నారు. యోగా వల్ల శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఏకాగ్రత పెరుగుతుందని వివరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి యోగాను అలవర్చుకోవాలని కోరారు. పాఠశాల స్థాయి నుంచే యోగాపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos