జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వేణు... సినిమాల్లోకి ప్రవేశించి బలగం సినిమా రూపొందించి ఆ సినిమాను సూపర్ సక్సెస్ చేశారు. బలగం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు, నటుడు వేణు.. ఇప్పుడు మరో అడుగు వేశాడు. బలగం తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన మరో సినిమాను అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. నాలుగు నెలల కిందటి వరకు జబర్దస్త్ వేణు అంటే గుర్తు పట్టేవారు... ఇప్పుడు మాత్రం బలగం వేణు అంటేనే అందరూ గుర్తు పట్టగలుగుతున్నారు. అంతలా తన సినిమాతో ప్రభావితం చేశాడు వేణు. కమెడియన్ గానే ప్రేక్షకులను నవ్వించడమే కాదు.. తెరవెనుక డైరెక్టర్ గా భావోద్వేగాలతో కన్నీళ్లు పెట్టించడమూ తెలుసని బలగం సినిమాతో నిరూపించుకున్నాడు వేణు. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వేణు.. ఇప్పుడు తీయబోతున్న రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. బలగం తరువాత వేణు తరువాత మూవీ ఎప్పుడు చేస్తాడా అని అంతా ఎదురు చూశారు. ఇప్పటికీ రెండు తెలుగురాష్ట్రాల్లోని తెలుగుప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ సినిమాపై డైరెక్టర్ వేణు అప్‌డేట్ ఇచ్చారు. తాను తీయబోతున్న రెండో సినిమా స్క్రిప్టు పనుల్ని ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు. ఎమోషన్స్ పండించడంలో దిట్ట అయిన వేణు... రెండో సినిమాలో కూడా ఎమోషనల్ సీన్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. వేణు చేస్తున్న రెండో సినిమా కూడా.... బలగం మాదిరిగానే సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మంచి లవ్ యాక్షన్ థ్రిల్లర్ కథ కావాలని కోరుకుంటున్నామంటూ మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఆయన నుండి ఈసారి వచ్చే చిత్రం ఎలాంటి జోనర్లో ఉంటుందో చెప్పలేం.. ఈ విషయం తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. బలగం సినిమాను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలే ప్రధాన కథగా తెరకెక్కించారు. ఇందులో ప్రధాన పాత్రలో ప్రియదర్శి, హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్, రూపాలక్ష్మీ తదితరులు నటించారు. ఇక .. వేణు.. రెండో సినిమా ఎలాంటిది తీయనున్నారు.. హీరో హీరోయిన్లు ఎవరనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎలాంటి కథా నేపథ్యాన్ని ఎంపిక చేసుకుంటారో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos