తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల మనసులు దోచుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఒకదానికి మించి మరొకటి ... ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణపై కేంద్ర కేబినెట్ తాజాగా వరాల జల్లు కురిపించింది. ప్రధాని మోడీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పసుపు బోర్డుతో పాటు సమ్మక్క-సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ-తెలంగాణ మధ్య కృష్ణా జల వివాదాల నేపథ్యంలో కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో మూడు రోజుల క్రితం ప్రధాని ప్రకటించిన మేరకు జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ బోర్డు దేశంలో పసుపు, దాని ఉత్పత్తుల అభివృద్ధికి పూర్తి శ్రద్ధ చూపుతుంది. నేషనల్ టర్మరిక్ కౌన్సిల్ అంటే పసుపు బోర్డు లో ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఔషధాల శాఖ, వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ, వాణిజ్యం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థల నిపుణులు ఉంటారు. అలాగే, పసుపు రైతుల ప్రతినిధులు, పసుపు ఎగుమతిదారులు, మూడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఇందులో సభ్యులు. పసుపు ఉత్పత్తిలో దేశంలోనే మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా రెండోస్థానం తెలంగాణాదే. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో పసుపును ఎక్కువగా పండిస్తారు.
ఇక ...తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ములుగులో ఏర్పాటుకానున్న 'సమ్మక్క-సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం'లో వచ్చే విద్యాసంవత్సరం అంటే 2023-24 నుంచే తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.899 కోట్లను మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది.
వాయిస్
రానున్న ఐదేళ్లలో ఈ విశ్వవిద్యాలయానికి అవసరమైన భవనాలను నిర్మించి ఇతర మౌలిక సదుపాయాలు, వసతి సౌకర్యాలను కల్పించాలని, నిర్మాణ పనులను వెనువెంటనే చేపట్టేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ మంత్రిమండలి సమావేశానికి హాజరైన విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరినట్టు సమాచారం.
వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం, ఎన్ఐటీ ఉన్నందున అక్కడ లేని కోర్సులను గిరిజన వర్సిటీలో మొదలుపెట్టాలని, ఇందుకు ఒక కమిటీని ఎంపిక చేసి తెలంగాణకు పంపించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపు నిర్మాణ పనులు ఊపందుకునేలా చూడాలని, ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేసేలా ఆదేశాలు కూడా జారీ చేశానని ఆయన చెప్పినట్టు సమాచారం.
కేబినెట్ తీసుకున్న మరో నిర్ణయం కృష్ణా జలాల వివాదంపైన. కృష్ణా జలాల సాధనకోసం పదేండ్లుగా తెలంగాణ చేసిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాలను అంతర్‌రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లుగా చేస్తున్న పోరాటంతో బీజేపీ సర్కారు చివరకు దిగిరాక తప్పలేదు. అంతర్‌రాష్ట్ర జల వివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం జలాలను పునఃపంపిణీ చేసేలా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న ట్రిబ్యునల్ 2కు టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ - టీఓఆర్ ఇస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంతో కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కే అవకాశం ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos