తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీక్ కేసులో సిట్ మళ్లీ దూకుడు పెంచింది. తాజాగా ఈ కేసులో కరీంనగర్‌కు చెందిన తండ్రి, కుమార్తెను అరెస్ట్ చేయడం కొత్త పరిణామంగా చెప్పుకుంటున్నారు. కరీంనగర్‌కు చెందిన మద్దెల శ్రీనివాస్‌ తన కూతురు సాహితి చేత  ఏఈ పరీక్ష రాసేందుకు నిందితుడు పోల రమేష్ సాయం కోరాడు. పోల రమేశ్ సహకారంతో సాహితి ... హైటెక్ మాస్ కాపీయింగ్ లో పరీక్షలు రాసినట్లు అధికారులు  గుర్తించడమే కాకుండా... కూతురు పరీక్షల కోసం పోల రమేశ్ తో శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చుకున్నాడనే విషయం... విచారణలో వెలుగులోకి రావడంతో శ్రీనివాస్, సాహితిలను అరెస్ట్ చేశారు.

ఇదిలాఉండగా... టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఆరుగురిని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. వీరు పోల రమేష్ నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లుగా సిట్ గుర్తించింది. వీరి వద్ద నుంచి సేకరించిన తర్వాత మరికొందరిన కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఏఈ పోల రమేష్.. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఏఈఈ పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ నిర్వహించిన రమేశ్‌.. ఆ తరువాత ఏఈ పరీక్ష పత్రాన్ని పలువురికి విక్రయించాడు. రమేష్ నుంచి దాదాపు 40 మంది ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏఈ పరీక్షలో 16వ ర్యాంక్ సాధించిన నాగరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మున్సిపల్ ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పోల రమేష్ నుంచి కొనుగోలు చేసేందుకు నాగరాజు 30 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని సమాచారం. ముందుగా కొంత మొత్తాన్ని రమేష్‌కు బదిలీ చేశాడు. ఆ తర్వాత పరీక్ష రాసిన నాగరాజు.. 16వ ర్యాంక్ సాధించాడు. దర్యాప్తులో భాగంగా నాగరాజు కోసం రామాపురం వెళ్లిన సిట్ అధికారులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం పోల రమేష్ కేంద్రంగా దర్యాప్తు కొనసాగుతోంది. పోల రమేష్ ఇప్పటికే ఏడుగురికి ఏఈఈ, డీఏవో పరీక్ష కోసం హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేశాడు. పరీక్ష కేంద్రాల యాజమాన్యం, అధ్యాపకుల సహకారంతో జవాబులను మైక్రో ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఉపయోగించి ఒప్పందం చేసుకున్న అభ్యర్థులకు అందించాడు. మరోవైపు, ఏఈ ప్రశ్నాపత్రాలను లక్షల రూపాయలకు విక్రయించాడు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు... ఇప్పటివరకు దాదాపు 80 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లి... ఎక్కడ ముగుస్తుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos