హైదరాబాద్‍లో సాగర్ రోడ్డులోని నిర్మాణంలో పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నిర్మాణ పనులు చేస్తుండగా.. ఫ్లైఓవర్ ర్యాంపు కూలిపోయి 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నారు. గాయపడిన కూలీలు అంతా బీహార్ కు చెందినవారిగా తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున ఫ్లైఓవర్‌లోని రెండు పిల్లర్ల మధ్య కార్మికులు శ్లాబ్‌ను వేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. తెల్లవారుజామున 3.10 గంటలకు ప్రమాదం జరిగిందని ... ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఓ ర్యాంపు మాత్రమే కూలిందని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు.. సాగర్ రింగ్ రోడ్డు వద్ద నిరసనకు దిగారు. నాసిరకం పనుల వల్లే ఫ్లైఓవర్ శ్లాబ్ కూలిందని విమర్శిస్తూ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలిని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంజినీర్ల బృందం విచారణ చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.

 

 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos