తెలుగు వినీలాకాశంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నటుడు.. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు.. నేడు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా.. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచ్చేసి... ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చలనచిత్ర రంగంలో అత్యంత ఉన్నతస్థాయికి ఎదిగిన ఏఎన్నార్ వృత్తిగత జీవితం నల్లేరు బండినడకలాగా సాగలేదు. ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక్కోమెట్టు ఎదుగుతూ... చలనచిత్ర రంగంలో గొప్ప ధ్రువతార లాగా శాశ్వతకీర్తినార్జించారు. వెండితెర బహుదూరపు బాటసారి అయిన అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్లలో ఒకరిగా వెలుగొందారు. లెజెండరీ నటుడిగా కీర్తించబడుతున్నారు. ఏఎన్నార్.. దాదాపు ఏడు దశాబ్దాలపాటు నటుడిగా రాణించారు. తెలుగు చిత్ర పరిశ్రమకి అత్యధికంగా సేవలు అందించిన నటుడిగా నిలిచారు. ఎన్నో విషయాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఎన్నో మరుపురాన చిత్రాలను, ఎన్నో క్లాసిక్స్ లో నటించి తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. లెజెండరీ నటుడిగా వెలుగొందారు. ఆయన 1924 సెప్టెంబర్ 20న జన్మించిన విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎన్నో క్లాసిక్ చిత్రాలకు జీవం పోసిన అద్భుత నటుడిగా గుర్తొస్తారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగురాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ ఎదిగేందుకు దోహదపడ్డ విషయాలు గుర్తొస్తాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మ విభూషణ్‌గా కేంద్ర ప్రభుత్వ గౌరవాలు, అనేక అవార్డులు గుర్తొస్తాయి. కానీ దాని వెనకాల చాలా అవమానాలున్నాయి. అనేక హేళనలు, బాడీషేమింగ్ కామెంట్లు ఉన్నాయి. నాటకాల నుంచి సినిమాల్లోకి వెళ్లారు ఏఎన్నార్. ఇక్కడ ఆయన అనేక నాటకాలు వేశారు. అందులో చురుకుగా యాక్ట్ చేయడంతో మంచి పేరొచ్చింది. సినిమాల్లో ప్రయత్నించమనే ఒత్తిడి పెరిగింది. దీంతో రైలు బండెక్కి మద్రాస్ చెక్కేశారు. అయితే ప్రారంభంలో ఏఎన్నార్ చాలా బక్కగా, పీలగా ఉండేవారు. దీంతో అనేక కామెంట్లు ఫేస్ చేశారు. పైగా ఆడనడక అంటూ హేళన కూడా చేశారు. సినిమాల్లో రాణించాలనే ఉత్సాహం, కసి ఓ వైపు, ఇలాంటి బాడీ షేమింగ్ విమర్శలు మరోవైపు ఆ సమయంలో మానసికంగా చాలా స్ట్రగుల్ అయ్యానని ఏఎన్నార్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇంగ్లీష్ భాష విషయంలోనూ ఆయనకు విమర్శలు తప్పలేదు. ఇంగ్లీష్ రాదని చాలా అవమానించేవారు. కనీసం పిల్లని కూడా ఇచ్చేవారు కాదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు అక్కినేని నాగేశ్వరరావు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో చాలా అవమానాలు, విమర్శలు ఉన్నాయని, ఆ కసి లో నుంచే ఇంగ్లీష్ నేర్చుకున్నానని తెలిపారు. బాధ, కసి, ఛాలెంజ్‌తో వచ్చిందన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఫేస్ చేసినట్లు చెప్పారు. ఇక చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు లాంటి వారని గతంలో మీడియా సంభోదించగా.. దీనిపై తనదైన స్టయిల్‌లో రియాక్ట్ అయ్యారు ఏఎన్నార్. ఏఎన్నార్, ఎన్టీఆర్ రెండు కళ్లు అయితే మిగిలిన వాళ్లంతా ఏమైపోయినట్లని.. ఎస్వీ రంగారావు, రేలంగి, గుమ్మడి, సూర్యకాంతం ... వీళ్లంతా ఏమైనట్లు అని ప్రశ్నించారు. ఈ మీడియా రాసే వాటికి ఉబ్బిపోయే పిచ్చివాళ్లు రామారావు కాదు, నేను కాదంటూ స్పష్టం చేశారు. ఏఎన్నార్ జానపదాలు, పౌరాణికాలు, సాంఘీకాలు ఇలా అన్ని రకాల చిత్రాలు చేశారు. లేడీ గెటప్స్, మల్టీస్టారర్స్ చేసి మెప్పించారు. టాలీవుడ్‌కి డ్యాన్స్ నేర్పించారు. తన 73ఏళ్ల సినిమా కెరీర్‌లో 250కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. దిగ్గజ నటుడిగా ఎదిగారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos