టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆయన న్యాయవాదులు నిన్న హౌస్ రిమాండ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయనకు హౌస్ రిమాండ్ అవసరంలేదని స్పష్టం చేసింది. చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుందని వెల్లడించింది. పైగా, సీఆర్పీసీలో హౌస్ రిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని పేర్కొంది. బెయిల్ లభించని కారణంగానే హౌస్ రిమాండ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఏపీ సీఐడీ తన కౌంటర్ లో ఆరోపించింది. అటు, ఏపీ సీఐడీ కస్టడీ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. ఏపీ సీఐడీ తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. మరికాసేపటిలో హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది. తీర్పు అనుకూలంగా వస్తుందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్యం చేస్తోంది. అయితే.. సీఐడీ మాత్రం హౌస్ రిమాండ్ ఇచ్చే ప్రసక్తే వద్దని.. అసలు సీఆర్పీసీలో అదేమీ లేదని చెబుతోంది. మరోవైపు.. తీర్పు పరిణామాలను బట్టి హౌస్ రిమాండ్‌పై హైకోర్టుకు వెళ్లే యోచనలో లూథ్రా టీమ్ ఉంది. ఇదిలావుండగా... స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబుపై ఏపీ సీఐడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలని టీడీపీ అంటోంది. రాజకీయ కక్ష సాధింపు కోసం ఏపీ సీఐడీ ఒక ప్రైవేటు సైన్యంలా తయారైందని మండిపడింది. అసందర్భ ప్రేలాపనలతో కూడిన రిమాండ్ రిపోర్టును సీఐడీ నిన్న కోర్టులో దాఖలు చేసిందని టీడీపీ విమర్శించింది. కుట్రపూరితంగా ఫోర్జరీ డాక్యుమెంట్లతో కాంట్రాక్టులు కుదుర్చుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దోచుకున్నారన్నది ఆ ఆరోపణల సారాంశం అని వివరించింది. 2013లో గుజరాత్ లో తీసుకువచ్చిన ప్రాజెక్టును మన రాష్ట్ర అధికారులు అధ్యయనం చేసి సిఫారసు చేసిన అనంతరం 2015లో ఇక్కడ కూడా అమలు చేసినట్లు టీడీపీ వెల్లడించింది. గుజరాత్ తో పాటు 8 రాష్ట్రాల్లో పనిచేస్తున్న సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్  వేర్ ఇండియా - సీమెన్స్ సాఫ్ట్ వేర్, డిజైన్ టెక్ సంస్థలతో గుజరాత్ లో అమలు చేస్తున్న షరతుల ప్రకారమే నాటి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపింది. ఏపీ సీఐడీ ... రిమాండ్ రిపోర్టులో అబద్ధాలు పేర్కొందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos