టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ, బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానాల్లో విచారణ సాగుతోంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని, రిమాండ్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ నెల 22న దాన్ని కొట్టివేసిన విషయం తెలిసిందే.  దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేయగా... అక్కడ విచారణ ప్రారంభమైనప్పుడు... ధర్మాసనంలోని జడ్జి ఎస్‌వీఎన్ భట్ ... నాట్ బి ఫోర్ మీ అని ప్రకటించి ... ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లారు.  దీంతో  ఈ కేసును ఆగస్టు 3వ తేదీన విచారణ చేయనున్నట్లుగా సీజేఐ ప్రకటించారు. ఈ క్రమంలో... చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చేముందు తమ వాదనను కూడా వినాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై చాలా ఆధారాలు ఉన్నాయని... విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించింది. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీ శాఖ అని తెలిపింది. ఈ కేసులో తమ వాదనను కూడా మీ ముందు ఉంచడానికి అనుమతివ్వాలని కోరుతూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా... ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ నెల 9వ తేదీన  అరెస్ట్ చేయగా...ఈ కేసులో చంద్రబాబు వచ్చే నెల 5వ తేదీ వరకు జ్యుడిషీయల్ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేయడంతో... మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos