ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఇదో ట్రెండ్‌గా మారిపోయింది. మొదట కర్ణాటకలో దీన్ని ఎన్నికల హామీగా కాంగ్రెస్‌ తెరపైకి తీసుకొచ్చింది. తర్వాత మిగతా రాష్ట్రాలు దాన్ని పట్టుకున్నాయి. తెలంగాణలో ఇటీవల ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాష్ట్రంలో కూడా ఇది అమలు అవుతోంది. ఈ క్రమంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పుడు ఏపీలోనూ రంగం సిద్ధం అవుతోంది. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ పథకం అమలు పైన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అన్నీ పరిగణలోకి తీసుకొని... సంక్రాంతి నుంచి అమలు అయ్యేవిధంగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని ప్రజల నుంచి దీనిపై వస్తున్న స్పందన చూసిన తరువాత... ఏపీ ప్రభుత్వం కూడా ఈ పథకం అమలుకు ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. దీనిపై అధికారులు రహస్యంగా అధ్యయనం చేస్తున్నారని ... వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలు చేస్తున్నారు... ఏ ఏ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు... దీనివల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు... ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది... ఆ లోటు పూడ్చటానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనే విషయాలన్నింటిపై సర్వే చేస్తున్నారని తెలుస్తోంది.

 
ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. సీఎం జగన్ తాను అమలు చేస్తున్న సంక్షేమం తనకు తిరిగి అధికారం నిలబెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ పథకంపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని టీడీపీ ప్రకటించింది. మహిళల్లో మంచి స్పందన కనిపిస్తుండటంతో జగన్ అలర్ట్ అయి తానే ఎందుకు అమలు చేయకూడనే ఉద్దేశంతో ... ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ... ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా. అన్నిరకాల పాస్ లు కలిగిన వారు 10 లక్షల మంది ఉంటారు. ఇందులో 3-4 లక్షల మంది విద్యార్ధినులు, మహిళలు ఉంటారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున రూ.17 కోట్ల వరకు రాబడి వస్తోంది. ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం రూ 6.కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలన్నీ అధికారులు నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందుగానే అమలు చేయాలని జగన్ ప్రభుత్వం  యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైన త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇది అమల్లోకి వస్తే ఏపీలో మహిళలకు కర్ణాటక, తెలంగాణ తరహాలోనే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం దక్కుతుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos