తానా సభలలో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్న హిందూపూర్ శాసనసభ్యులు, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, నాట్స్ మాజీ ప్రెసిడెంట్ మన్నవ మోహన్ కృష్ణ, తానా కాన్ఫరెన్స్ అడ్వైజర్ జానీ నిమ్మలపూడి, సతీష్ మేక ఘన స్వాగతం పలికారు. బాలకృష్ణ... సతీమణి వసుంధర, మనవడితో కలిసి న్యూజెర్సీ చేరుకున్నారు. భారీ ర్యాలీగా నందమూరి బాలకృష్ణను తోడ్కొని వెళ్లారు. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో 9వ తేదీ వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం - తానా 23వ మహాసభలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ సభలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. మ్యూజిక్ సెన్సేషన్, మాస్ట్రో ఇళయరాజా, యంగ్ సెన్సేషన్ శ్రీలీల పాల్గొంటున్నారు. కాగా... అంతకుముందు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి హైదరాబాద్ కు వచ్చి బాలకృష్ణను స్వయంగా కలిసి ... తానా మహాసభల ఆహ్వానపత్రాన్ని అందించిన సంగతి తెలిసిందే. తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను, తెలుసుకుని తానా నాయకులను బాలకృష్ణ అభినందించారు. 2022 డిసెంబర్ లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తానా.. కోటి రూపాయల విరాళాన్ని అందించిన విషయాన్ని బాలయ్య గుర్తు చేసుకున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos