సినీ నటి, ఏపీ మంత్రి రోజా గురించి పరిచయం అవసరం లేదు. రాజకీయాల్లో ఆమె ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్నారు. రోజా 2002లో తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిని వివాహం చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యారు. సెల్వమణి తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. రచయితగా, నిర్మాతగా సైతం సెల్వమణి సినిమాలు చేశారు. ప్రస్తుతం ... ఇదంతా ఎందుకంటే... ఆర్కే సెల్వమణికి చెన్నై జార్జిటవున్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. 2016 లో ఆర్కే సెల్వమణి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణ్ అన్నరసుతో కలిసి ఒక టీవీ ఛానెల్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంలో తన పరువు ప్రతిష్టలను కించపరిచేలా సెల్వమణి వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ప్రముఖ సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా జార్జిటౌన్ కోర్టులో దావా వేశారు. ఈ కేసు ఇలా నడుస్తుండగా... కొంతకాలానికి ముకుంద్ చాంద్ మరణించారు. తండ్రి మరణించినప్పటికీ ఈ కేసుని ముకుంద్ తనయుడు వదిలిపెట్టలేదు. సెల్వమణికి వ్యతిరేకంగా కేసు కొనసాగిస్తూనే ఉన్నారు. పలు సందర్భాల్లో సెల్వమణి కేసు విచారణకు హాజరుకాలేదు. సోమవారం మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణకి సెల్వమణి కానీ, ఆయన తరపు లాయర్ కానీ హాజరు కాలేదు. దీంతో కోర్టు సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఇది సెల్వమణికి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 22న జరగనున్నట్లు తెలుస్తోంది. పూలన్ వైశారని, కన్మణి, తెలుగులో దుర్గ లాంటి చిత్రాలని సెల్వమణి తెరకెక్కించారు. ప్రస్తుతం సెల్వమణి ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదండీ సెల్వమణి అరెస్టు కథ. నాన్ బెయిలబుల్ వారెంట్ ని సెల్వమణి ఎలా ఎదుర్కొంటారో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos