ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం... ఇన్నేళ్లు గడిచినా దాని ఊసే ఎత్తకపోగా... తాజాగా విభజన హామీలపై కేంద్రం చేసిన ప్రకటన సెన్సేషనల్ గా మారింది. స్పెషల్ స్టేటస్ పై అధికారంలో ఉన్న వైసీపీ కానీ ... ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేకపోతోంది. ఇక జనసేన సరేసరి. ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉందికాబట్టి ... కమలనాథులకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏపీకి పునర్వభిజన చట్ట హామీల అమలు పైన మరోసారి స్పష్టత ఇచ్చి... హామీలు ఒట్టి మాటలేనని తేల్చేసింది.

కేంద్రం ప్రకటనతో ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా జనసేన డిఫెన్స్ లో పడటమే కాకుండా... టీడీపీ ... బీజేపీతో పొత్తుకు ముందుకు వస్తుందా... రాదా  అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ పునర్విభజన చట్టం అమలు పై కేంద్రం తాజాగా పార్లమెంట్ లో ప్రకటన చేస్తూ... కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కుదరదని ... సాంకేతికంగా... ఆర్థికంగా అది సాధ్యం కాదని స్పష్టంగా వివరించింది. ఇదే కాదు... విభజన చట్టంలో ఇచ్చిన పలు హామీలు అమలు కాలేదు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ... జగన్ ను ఓడించేందుకు టీడీపీతో జనసేన దాదాపు పొత్తు ఖాయమేనని తెలుస్తోంది. జనసేనాని పవన్ ... ఎన్డీఏలో పవన్ భాగస్వామిగా ఉన్నారు. టీడీపీని కూడా... తమతో కలుపుకొని వెళ్లే దిశగా పవన్ సంకేతాలు ఇస్తున్నారు.

2019 ఎన్నికల సమయంలో స్పెషల్ స్టేటస్ డిమాండ్ అంశంలోనే అప్పట్లో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విభజన హామీలపైన కేంద్రం హామీలు ఒట్టి మాటలేనని తేలి పోయింది. మరోవైపు కేంద్రప్రభుత్వ వాదన ఇంకోవిధంగా ఉంది. విశాఖలో సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు రూ.106.89 కోట్లను గత ఏడాది మంజూరు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్లు కేటాయించామని కేంద్రం చెబుతోంది.
విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు దుగరాజుపట్నంలో మేజర్‌ పోర్టు ఏర్పాటు సాధ్యం కాదని తేల్చామని... పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న సంస్థల ఏర్పాటుకు కలిపి ఇప్పటివరకు రూ.21,154.568 కోట్లు విడుదల చేశామని కేంద్రం చెబుతోంది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, అంశాలు, నిబంధనల అమలుపై సంబంధిత కేంద్ర శాఖల అధికారులు, రెండు రాష్ట్రాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని... ఇప్పటి వరకు 31 సమీక్షలు నిర్వహించామని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి విభజన హామీల అమలుపై చేతులెత్తేయడంతో ఇప్పుడు ఏపీలోని అన్ని ప్రధాన పార్టీల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనేలాగా తయారైంది.
ఈ సమయంలో తిరిగి బీజేపీతో జత కట్టడంతో రాజకీయంగా టీడీపీ, జనసేన పార్టీలు ఇరకాటంలో పడతాయనే చర్చ మొదలైంది. వైసీపీ స్టాండ్ ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఏం జరుగుతుందోమరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos