టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు రిమాండ్ ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఆయన తరపు లాయర్లు తాజాగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  చంద్రబాబు తరపున మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్ వేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని పిటిషన్ లో పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించి...  ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఇదిలావుండగా... అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్‌ కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసులో సీఐడీ ... చంద్రబాబును  ఏ-1 నిందితునిగా చూపించింది. ఇప్పటికే దీనిపై పీటీ వారెంట్‌ వేసిన సీఐడీ... చంద్రబాబును విచారించేందుకు అనుమతి తీసుకుంది. ఆయనకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ వస్తే అమరావతి కేసులో అరెస్టు చేయడానికి సీఐడీ రెడీగా ఉంది. న్యాయస్థానాల తీర్పుల నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos