అనంతపురం జిల్లా కౌకుంట్ల గ్రామంలో జరిగిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు పార్టీ అధినేత చంద్రబాబు హాజరై ... వధూవరులు విక్రమ్, లోహితను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు పలువురు హాజరయ్యరు. తనను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులకు చంద్రబాబు అభివాదం చేశారు. కాగా... శ్రావణమాసం కావటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిసందడి నెలకొంది. మరో రెండు రోజుల్లో శుభముహుర్తాలు ముగియనున్నాయి. ఈ రెండు రోజుల్లో లక్షల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. శ్రావణ మాసంలో ముహుర్తాలు తక్కువగా ఉండటమే కాకుండా... గడిచిన రెండు నెలల నుండి అసలే ముహుర్తాలు లేవు. తాజాగా ఖరారు చేసుకున్న ముహుర్తాల్లోనే ఎక్కువ మంది వివాహాలు చేసుకోవడానికి నెలల క్రితమే ఫంక్షన్ హాల్స్ ను బుక్ చేసుకున్నారు. దీంతో ఫంక్షన్ హల్స్, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్స్, పెళ్లిల్లు చేసే పురోహితులు,మ్యారేజ్ ఈవెంట్స్ వారిని ముందుగానే మాట్లాడుకున్నారు. ఇక శుభ ముమూర్తాలు ఇప్పట్లో లేవని... భాధ్రపదమాసంలో శుభముహుర్తాలు ఉండవని ... ఆశ్వీయుజ మాసంలో అమ్మవారి నవరాత్రులు, దీపావళి ఇత్యాది పండుగల అనంతరం కార్తీకమాసంలో మంచి ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. నవంబర్ 16న ప్రారంభమయ్యే ముహుర్తాలు జనవరి 5వ తేదీవరకు ఉంటాయని అంటున్నారు. వివాహ కార్యక్రమాలకైనా, గృహ ప్రవేశం తదితర శుభ కార్యక్రమాలకైనా అప్పటివరకు ఆగాల్సిందేనని వారు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos