టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. నిన్న మొన్నటివరకు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బిజీబిజీ గా గడిపిన ఆయన మళ్లీ... విశాఖ పర్యటనకు ప్లాన్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన విశాఖలో పర్యటించి... విజన్ డాక్యుమెంట్ 2047 ఆవిష్కరిస్తారని టీడీపీ నాయకులు తెలిపారు. ఆ రోజున చంద్రబాబు... బీచ్ రోడ్డులో సాయంత్రం 4గంటలకు ఎన్టీఆర్ విగ్రహం నుంచి రెండు కిమీ వరకు బీచ్ వాక్ చేస్తారని... భవిష్యత్తులో మానవ వనరుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆయన డాక్యుమెంట్ రూపొందించారని తెలిపారు. ఆయన రూపొందించిన విజన్ 2020 డాక్యుమెంట్ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని.. అందుకు హైటెక్ సిటీ నిర్మాణమే నిదర్శనమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఏపీలో 7 విమానాశ్రయాలు వచ్చాయని.. నైట్ ల్యాండింగ్ సదుపాయాలు వచ్చాయని...భవిష్యత్తును ఊహించి రూపొందించిన డాక్యుమెంట్ ఇది అని వివరించారు. విజన్ సృష్టించడం అంటే జగన్ లాగా బటన్ నొక్కడం కాదని... స్వాతంత్ర్య దినోత్సవం రోజున విజన్ డాక్యుమెంట్‌ను చంద్రబాబు ఆవిష్కరిస్తారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే సరికి చంద్రబాబు దార్శనికత ఏమిటో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. డాక్యుమెంట్ ఆవిష్కరణలో ప్రజాభిప్రాయం తీసుకుంటామని.... ప్రజాభిప్రాయాన్ని డాక్యుమెంట్ ఆవిష్కరణలో జోడిస్తామని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos