టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. చంద్రబాబుకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. అనంతరం సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించారు.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. చంద్రబాబు వెంట విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ, జనసేన నేతలు ఉన్నారు. తెలుగు ప్రజలు సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో జీవించేలా, వారికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని, దుష్టుల నుంచి సమాజాన్ని రక్షించాలని అమ్మవారిని వేడుకున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని, అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, దుష్టశక్తులు అడ్డుకున్నా తన పయనం ఆగబోదని స్పష్టం చేశారు. మానవ సంకల్పానికి దైవం ఆశీస్సులు ఉండాలని, అందుకే తాను ఈ యాత్ర చేపట్టానని చెప్పారు. తనకు అన్యాయం జరిగినప్పుడు దేశవిదేశాల్లోని తెలుగు వారంతా న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటాలు చేశారన్నారు. మరోవైపు చంద్రబాబు ఆదివారం సింహాచలం అప్పన్న దర్శనానికి వెళతారు. 3వ తేదీ ఉదయం 11 గంటలకు గన్నవరం నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారు. ఈ నెల 5న చంద్రబాబు శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకుంటారు. అంతేకాదు కడప దర్గా, విజయవాడ గుణదల మేరిమాతను కూడా దర్శించుకుంటారు. ఈ నెల 10 నుంచి అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos