చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ... జాబిల్లి పైన సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం అయింది. 40 రోజులుగా ... ప్రపంచవ్యాప్తంగా ... ఎదురు చూస్తున్న కోట్లాది కళ్లు ఆ అపురూప ఘట్టాన్ని చూసి ఆనందబాష్పాలు రాల్చాయి. సాఫ్ట్ ల్యాండింగ్ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అంతకుముందు అరగంట పాటు దేశమంతా అందరూ టీవీలు, ఫోన్ల తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు. చంద్రుడి ఉపరితలం నుంచి 28 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్ ల్యాండర్ వర్టికల్ వెలాసిటీ 31 మీటర్స్ పర్ సెకండ్, హారిజాంటల్ వెలాసిటీ 1058 మీటర్స్ పర్ సెకండ్ గా ఉంది. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ మొదలైన సరిగ్గా 8 నిమిషాల తర్వాత 21 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ ఉంది. అప్పుడు హారిజాంటల్ వెలాసిటీ 745 మీటర్స్ పర్ సెకండ్, వర్టికల్ వెలాసిటీ 67 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీలో ఉంది. ఈ 8 నిమిషాల్లో 700 కిలోమీటర్లకు పైగా దూరం ల్యాండర్ ప్రయాణించింది. ఈ క్రమంలో... మెల్లగా సెన్సార్ల సాయంతో హారిజాంటల్ వెలాసిటీ, వర్టికల్ వెలాసిటీని మరింత తగ్గించుకొని చంద్రుడి ఉపరితలం వైపు కదులుతూ వచ్చింది. చంద్రుడిపై దిగే ముందు హారిజాంటల్ వెలాసిటీ 0.4 మీటర్స్ పర్ సెకండ్, వర్టికల్ వెలాసిటీ 2 మీటర్స్ పర్ సెకండ్ గా ఉంటూ... చివరికి ఉపరితలంపై క్షేమంగా దిగింది. చంద్రయాన్ 3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావడంతో భారత్ లోని ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను మనసారా ప్రశంసిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos