చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ... చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా విజయవంతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. చంద్రయాన్ 3 స్పేస్‌క్రాఫ్ట్ ఆగస్టు 23న చంద్రునిపై ల్యాండ్ అవ్వడానికి షెడ్యూల్ చేశారు. ప్రస్తుతం చంద్రయాన్-3 ను 153 బై 163 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంటే దీని ద్వారా చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు... అదే తిరగడం ఇక అయిపోయిందన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే చంద్రయాన్-3 అనే సినిమాకు ఇప్పుడు పూర్తి చేసుకున్న ఘట్టం ప్రీ-క్లైమాక్స్ అన్నమాట. ఇక క్లైమాక్స్ కు రంగం సిద్ధమైంది. ఈ ప్రయత్నం విజయవంతం అయితే... యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనాల సరసన భారత్ చేరుతుంది. ఈ అద్భుతమైన మైలురాయిని సాధించిన నాలుగోదేశంగా అవతరిస్తుంది. ఈ మిషన్... ఏపీలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జూలై 14న విజయవంతంగా లాంచ్ చేశారు. ఇది ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంలో ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. నాలుగు ల్యాండింగ్ కాళ్లు... నాలుగు ల్యాండింగ్ థ్రస్టర్లు 800 న్యూటన్‌లతో అమర్చబడి, విక్రమ్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం రూపొందించబడింది. ఇది ప్రగ్యాన్ అనే రోవర్‌ని కలిగి ఉంటుంది. ల్యాండింగ్ విజయవంతంగా జరిగిన తర్వాత ఈ రోవర్ విడుదల చేయబడుతుంది. ఈ మిషన్ విజయవంతమైతే... చంద్రునిపై ఉన్న విలువైన డేటాను అందిస్తుంది. ఇస్రోలోని బృందం బెంగళూరులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ మరియు కమాండ్ నెట్వర్క్ నుండి అంతరిక్ష నౌక స్థితి ని పర్యవేక్షిస్తుంది. స్పేస్ రేస్‌లో... చంద్రుని దక్షిణ ధ్రువంపై ... అడుగుపెట్టిన తొలిదేశం గా కొనసాగడానికి భారత్.. రష్యాలు పోటీ పడుతున్నాయి. కాగా... స్పేస్ లో ప్రస్తుతం అన్ని వ్యవస్థలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని ... అంతా సవ్యంగా జరుగుతోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. ఈ నెల 23న చంద్రునిపై ల్యాండింగ్ చేసేందుకు వరుసగా కక్ష్య విన్యాసాలు చేస్తున్నామని అన్నారు. ఎనీ హౌ... చంద్రయాన్ 3 చంద్రునిపై 23న సాఫ్ట్ గా ల్యాండ్ అవ్వాలని కోరుకుందామా మరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos