ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇద్దరూ వేర్వేరుగా వ్యక్తిగత పనుల కోసం ఈ పర్యటనలు చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ సీబీఐ కోర్టును అనుమతి కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. లండన్‌లో తన కుమార్తె స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని  సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులు కోర్టును సమయం కోరారు. ఈ క్రమంలోనే సీబీఐ కోర్టు.. సీఎం జగన్ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ అభ్యంతరాలు చెప్పకపోతే విదేశీ టూర్లు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిస్తుంది. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించడానికి ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా యూకే, యూఎస్‌ఏ, జర్మనీ, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి తన పిటిషన్‌లో కోరారు. విజయసాయిరెడ్డి పిటిషన్‌పై కూడా కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. ఈ నెల  30వ తేదీన విచారణ జరగనుంది. సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకూ యూరప్ టూర్ లో ఉంటారు. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ తో పాటు విజయసాయిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ కోర్టు పలు షరతులు విధించింది. ఇందులో కోర్టు ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లరాదనే షరతు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వీరిద్దరూ విదేశీ పర్యటనలకు అనుమతి కోరారు. గతంలోనూ సాయిరెడ్డి ఓసారి కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ దాఖలు చేసుకున్న పిటిషన్లపై స్పందించేందుకు సీబీఐ గడువు కోరడంతో విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. ఏం జరుగుతుందోమరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos