అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యలతో కలకలం రేగుతోంది. వైసీపీ నాయకులను క్రిమినల్ గ్యాంగ్‌గా అభివర్ణిస్తూ... వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతానని తెలిసే ... ఈ క్రిమినల్ గ్యాంగ్‌తో గొడవపెట్టుకుంటున్నానని పవన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. తాను ఓడిపోతానని చెబుతూనే... 2024 ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇస్తే తడాఖా చూపిస్తానని పవన్ అనడంతో అభిమానుల మదిలోనూ గందరగోళం ఏర్పడింది.
ఎన్నికలకు ఇంకా సుమారు పదినెలల ముందే... తాను ఓడిపోతానంటూ... పవన్ కాడి కింద పడేయమేమిటని ఆయన అభిమానులు డీలా పడిపోయారని తెలుస్తోంది. పొత్తుల అంశాన్నీ ప్రస్తావిస్తూ... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవల వైసీపీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని విమర్శిస్తూ ... ఆయన తండ్రిని సైతం వదిలి పెట్టకుండా పలు ఆరోపణలు చేసిన పవన్ ... ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా ... నేను ద్వారంపూడి కుటుంబానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు.
అనంతరం... పవన్... సినిమాలపైన కూడా చాలా ఆవేశంగా మాట్లాడారు. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమేనని.. సినిమాను రాజకీయం చేయొద్దన్నారు. మా నటులందరం.. కలిసినప్పుడు బాగానే మాట్లాడుకుంటామని.. మరి మీరెందుకు ఇలా గొడవ పడతారని ప్రశ్నించారు. మహేష్ బాబు, ప్రభాస్ నా కంటే పెద్ద హీరోలు... నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకునే స్టార్స్ వారు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందినవారు.
కానీ నాకు ప్రపంచవ్యాప్తంగా అంతగా తెలియకపోవచ్చు. నాకు ఈగో లేదు... సగటు మనిషి బావుండాలి అని కోరుకునే వ్యక్తిని నేను అన్నారు పవన్ కళ్యాణ్. అందరు హీరోల ఫ్యాన్స్ ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందాం అంటూ... పవన్ చేసిన పలు వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాలతో పాటు.. ఇటు సినిమా వర్గాల్లో కూడా ఆసక్తికరంగా మారాయి. చాలామంది ... పవన్ వ్యాఖ్యలకు కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ తో పాటు.. పవన్ మాటలు నచ్చిన వారంతా.. ఆయన్ను సపోర్ట్ చేస్తూ.. కామెంట్లు పెడుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos