మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టారు. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. దీంతో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్లో అంతులేని ఆనందం ఆకాశాన్నంటుకుంటుంది. మెగా అభిమానుల్లో కూడా సంబురాలు మొదలయ్యాయి. మెగా ప్రిన్సెస్ కు జన్మనిచ్చిన రామ్ చరణ్-ఉపాసనకు అందరు అభినందనలు తెలుపుతున్నారు. తనకు మనవరాలు పుట్టిన ఆనందాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
'లిటిల్ మెగా ప్రిన్సెస్'కు స్వాగతం అంటూ చిరు ట్వీట్ చేశారు. హార్ట్ సింబల్స్ తో తన మనవరాలిపై ప్రేమను కురిపించారు. నీ రాకతో లక్షలాది మందితో కూడిన మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపావని ఆనందం వ్యక్తం చేశారు. నీ రాక ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని అని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు మీమ్స్ తో, అభినందనలతో కామెంట్స్ చేస్తున్నారు.
ఉపాసన కొణిదెల హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాక.. అన్ని పరీక్షల తర్వాత వైద్యులు 20వ తేదీ ఉదయం డెలివరీ చేశారు. పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిందని ఆస్పత్రి బృందం వెల్లడించింది. ఈ శుభావార్త తెలియగానే మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఆస్పత్రికి చేరుకున్నారు. లిటిల్ మెగా ప్రిన్స్ కు స్వాగతం పలికారు. రామ్ చరణ్ - ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా... రామ్ చరణ్ తండ్రి కావడంతో ... ప్రస్తుతం తనుకున్నబిజీ షెడ్యూల్ ను ఓ మూడు నెలల వరకు వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. ఈ సమయం మొత్తం ఫ్యామిలీకే కేటాయించేలా ప్లాన్ చేశారని సమాచారం. మొత్తానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్షణం రావడం, మహాలక్ష్మి రాకతో మెగా ఇంట పట్టలేని ఆనందం కనిపిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos