జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఆయన తీసే సినిమాలలో అనేక రాజకీయపరమైన సీన్లు, పవర్ ఫుల్ పంచ్ లు కనిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన బ్రో సినిమాలో కూడా వర్తమాన రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించేలా సన్నివేశాలు, డైలాగులు పెట్టి ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్.
బ్రో సినిమాలో పృథ్వీ చేసిన శ్యాంబాబు పాత్రతో ఏపీ మంత్రి అంబటి రాంబాబును పరోక్షంగా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో శ్యాంబాబు పాత్రలో నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన డ్యాన్స్‌పై పెద్ద దుమారమే రేగుతోంది. ఇది ఏపీ మంత్రి అంబటి రాంబాబు ... ఆమధ్య సంక్రాంతి పండుగకు చేసిన డ్యాన్స్‌ను పోలి ఉందని వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘బ్రో’ సినిమా నటులు, నిర్మాతలను తిట్టిపోస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఎట్టకేలకు మంత్రి అంబటి రాంబాబు స్పందించి పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టి దూషించారని విన్నానని.. కానీ ఆ సినిమా చూడలేదని అంబటి రాంబాబు అన్నారు. శునకానందం పొందే పరిస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలు చాలా చూశానని.. తాను పెద్ద సినిమా పిచ్చోడినని అన్నారు. అలాగే ఒక సినిమాలో నటించారు కదా అంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు...‘‘నేను పూర్తిగా నటిస్తే వారు కంగారు పడతారు’’ అంటూ అంబటి రాంబాబు వెరైటీగా సమాధానం ఇచ్చారు.
అంబటి ఇంకా ఏమన్నారంటే... పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నటులు... నా క్యారెక్టర్ పెట్టి దూషించారని విన్నా.. నామీద కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కో... అలా నన్ను ఎదుర్కోలేకపోతున్నావని పవన్ పై కామెంట్ చేశారు. నీ సినిమాలో ఆయన ఎవరో డబ్బు ఖర్చు చేస్తే అక్కడ నా క్యారెక్టర్ పెట్టి ఆనందపడుతున్నావని... ఆ క్యారెక్టర్‌కు శ్యాంబాబు అని పేరుపెట్టి ... ఆ క్యారెక్టర్ ను తిట్టి ఆనందపడుతున్నావని.. అలా పడే ఆనందాన్ని శునకానందం అంటారని రాంబాబు కామెంట్ చేశారు. ఎవరో డబ్బులు ఇస్తే, ప్యాకేజీ తీసుకుని నేను డ్యాన్స్ చెయ్యనని.. నేను సంక్రాంతికి ముగ్గులు పోటీ పెట్టి డ్యాన్స్ చేశానని ... దాన్ని డ్యాన్స్ అనడం కంటే ఆనంద తాండవం అంటారని రాంబాబు అన్నారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకొని డ్యాన్స్ చేసే నువ్వు నా డ్యాన్స్‌ను కామెంట్ చేస్తావా... నేను వేసిన డ్యాన్స్ ... గెలిచి వేసిన సంక్రాంతి డ్యాన్స్ అని.. నువ్వు ఓడి వేసిన డ్యాన్స్ కాళరాత్రి డ్యాన్స్ అని కామెంట్ చేశారు.
మా అన్న సినిమా యాక్టర్ అయితే నేను సినిమా యాక్టర్ కాలేదని.. మానాన్న ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే కాలేదని అంబటి రాంబాబు అన్నారు. ఈసారి మళ్లీ భోగి పండగ రోజు డ్యాన్స్ చేస్తానని... పవన్ కళ్యాణ్ నువ్వు వచ్చి చూసుకో ... నా డ్యాన్స్ సింక్ అవుతుందో లేదో ప్రజలు చూస్తారని అన్నారు. అసలు నువ్వు ప్రజలతో సింక్ అవుతావో లేదో చూసుకో అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తి గొలిపింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos