ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారగా... తెలంగాణ పరిస్థితి కాస్త మెరుగుపడింది. 2022-23 సవరించిన బడ్జెట్ల విశ్లేషణ ఆధారంగా రూపొందించిన రాష్ట్రాల ర్యాంకుల్లో ఏపీ 11వ స్థానానికి పడిపోయింది. 2021-22 ర్యాంకుల్లో ఏపీ 8వ స్థానంలో ఉండేది. 17 రాష్ట్రాలపై డాయిష్ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ దాస్ ఈ నివేదికను తయారు చేశారు. అందులోని వివరాల ప్రకారం.. 2022-23కు సంబంధించి తెలంగాణ నాలుగో ర్యాంకు నుంచి మూడో స్థానంలోకి వచ్చింది. స్థిరమైన ఆదాయ వనరులు, వ్యవసాయం, ఇతర రంగాల్లో అభివృద్ధి కారణంగా ... తెలంగాణ... తన ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకుంటోంది. మహారాష్ట్ర మొదటి స్థానంలో, చత్తీస్‌గఢ్ రెండో స్థానంలో నిలవగా... ఏపీ ప్రస్తుతం 11వ ర్యాంకుకు చేరింది. 2022-23 నివేదికలో అత్యంత దారుణ స్థితిలో ఉన్న రాష్ట్రాలుగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లు ఉన్నాయి. గుజరాత్ కూడా 2021-22తో పోలిస్తే గుజరాత్ గత బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఐదు నుంచి ఏడోస్థానానికి పడిపోయింది. కేరళ అత్యంత దుర్భరమైన ఆర్థిక పరిస్థితి ఉన్న ఐదు రాష్ట్రాల జాబితా నుంచి బయటకు వచ్చింది. 2023-24కు సంబంధించిన ఏపీ ర్యాంకు వివరాలు తెలియరాలేదు. 17 రాష్ట్రాల ఆర్థిక స్థితిని బడ్జెట్లను విశ్లేషించి నాలుగు అంశాల ఆధారంగా కౌశిక్ దాస్ నిర్ణయించారు. ఆర్ధిక లోటు, సొంత పన్నుల ఆదాయం, రాష్ట్ర అప్పులస్థాయి, జీఎస్డీపీ శాతాలను ఈ ర్యాంకుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఇంకా రెవెన్యూ ఆదాయం నుంచి చెల్లించే అప్పులు, వడ్డీలను కూడా లెక్కలోకి తీసుకొని నివేదిక రూపొందించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos