ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య పలు ఆస్తులు, ఇతర అంశాలకు సంబంధించి జరిగిన విభజన వివాదాలు ఇప్పటికీ ఎలాంటి పరిష్కారాలకు నోచక అదేవిధంగా కొనసాగుతున్నాయి. అలాంటి వివాదాల్లో తాజాగా విద్యుత్ బకాయిల విషయం తాజాగా చర్చనీయాంశమైంది.
ఏపీకి... తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను ఆర్‌బీఐ ద్వారా వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్న కేంద్రం ప్రకటన నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్ పంపిణీ జరిగింది.
ఇందుకు ఏపీ సరఫరా చేసిన విద్యుత్‌కు చెల్లించాల్సిన బకాయిలను ఆర్‌బీఐ ద్వారా వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా... విద్యుత్తు బకాయిలకు సంబంధించి తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోవద్దని కేంద్రానికి ... తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి విద్యుత్తు బకాయిలు రూ.6756.92 కోట్లు చెల్లించాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా బకాయిల కోసం తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు వాటిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది.
హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల గడువు ముగిసిపోవడంతో వాటిని పొడిగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల పార్లమెంటులో కేంద్ర మంత్రి ... తెలంగాణకు రావాల్సిన నిధుల్లో విద్యుత్తు బకాయిలు మినహాయించుకుని ఆర్‌బీఐ ద్వారా ఏపీకి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు.
దీంతో తెలంగాణ మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించని పక్షంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని తెలంగాణ కోర్టుకు తెలిపింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయడానికి గడువు కావాలని ఏపీ తరఫు న్యాయవాది కోరడంతో ధర్మాసనం అనుమతించి, విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. విచారణ జరిపే వరకు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos