కాలం మారుతున్న కొద్దీ... రుతు చక్రంలోనూ మార్పులు సంభవిస్తుండటంతో పలురకాల వ్యాధులు ముప్పిరుగొంటున్నాయి. జూన్ తొలివారంలో ప్రారంభం కావాల్సిన వర్ష రుతువు గతి తప్పి ఆలస్యం కావడంతో దేశవ్యాప్తంగా భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసి అపార ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. వానలు పడుతున్న ఈ సీజన్ లో అనేక రకాల వైరస్ లు వృద్ధి చెంది మానవ ఆరోగ్యంపై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇప్పుడు కళ్లకలక ... కలకలం సృష్టిస్తోంది. ఆడివో వైరస్ లతో తలెత్తే కళ్లకలక శాస్త్రీయ నామం ఎన్టైటిస్. ఒకరి నుంచి మరొకరికి తేలికగా వ్యాపించే ఇది మహమ్మారిలా విజృంభిస్తోంది. వాస్తవానికి ఇది పెద్ద సమస్య కాదు.  పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఒకటి లేదా రెండు వారాల్లో దానంతటదే తగ్గిపోతుంది. అలాగని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం తగదని వైద్యులు చెబుతున్నారు. అసలు .. ఈ మహమ్మారి మన చెంతకు రాకుండానే ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తరువాత కూడా వైద్యులు సూచించే తేలికపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇది ఇతరులకు అంటుకోకుండా చూడటమూ మన బాధ్యతేనని గుర్తించాలి. కళ్లకలక వచ్చిన తరువాత... కన్ను తెరవాలంటే .. లోపల గుచ్చుకుంటున్న బాధ ఉంటుంది. కంట్లోంచి నీరు కారుతూ ఉంటుంది. పడుకున్నా నిద్ర పట్టదు. చెప్పుకోవడానికి చిన్న సమస్యే అయినా ... అది ఉన్నంతసేపు ఇబ్బందిగానే ఉంటుంది. మన కంటిలోని కార్నియా పొడిబారితే చూపు తగ్గుతుందని... కన్నీటిలోని లైసోజోమ్ అనే ఎంజైమ్ బ్యాక్టీరియా, వైరస్ లను నిలువరిస్తుంటుందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని కంటి నిండా విస్తరించేలా చేసేది కన్జన్ క్టైవా నే. ఈ పొర ఉబ్బటమే కళ్లకలకకు దారితీస్తుందని... దీనికి బ్యాక్టీరియా, వైరస్, అలర్జీల వంటివేవైనా కారణం కావొచ్చని అంటున్నారు. కళ్ల కలక ఒకరి నుంచి మరొకరికి తేలికగా.. త్వరగా వ్యాపిస్తుందనేది తెలిసిందే కదా. కుటుంబంలో ఒకరికి వస్తే అందరికీ అంటుకోవచ్చు. అందువల్ల కళ్ల కలక వచ్చినవారు విడిగా ఉండటం చాలా ముఖ్యం. ఉద్యోగులు ఆఫీసులకు, విద్యార్థులు బడులకు వెళ్లొద్దు. ముఖ్యంగా తొలి 5 నుంచి 10 రోజుల వరకు ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనూ వేరే గదిలో ఉండాలి. కలక తగ్గుతున్న దశలో ఇతరులతో కలిసినా ఇబ్బందేమీ ఉండదు.
ఈ దశలో బాధితులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
నల్ల కళ్లద్దాలు ధరించాలి. దీంతో కళ్లకు ఎక్కువ వెలుతురు తగలకపోవడమే కాకుండా.. చేతులతో కళ్లను నులమటమూ తగ్గుతుంది. ఇది సమస్య తీవ్రం కాకుండా కాపాడటానికే కాదు.. ఇతరులకు అంటుకోకుండానూ నిలువరిస్తుంది.
చేతులను తరుచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలకకు కారణమయ్యే వైరస్, బ్యాక్టీరియా ఆయా ఉపరితలాల మీద ఎక్కువసేపు జీవించి ఉంటుంది. వాటిని తాకిన చేతులతో కళ్లను రుద్దుకుంటే వెంటనే అంటుకుంటుంది. కళ్లకలక వచ్చినవారు తమ దుప్పటి, తువ్వాలు వంటివి విడిగా పెట్టుకోవాలి. ఇతరులు వాడుకునే వాటితో కలవనీయొద్దు. ఫోన్ వంటి పరికరాలు షేర్ చేసుకోవద్దు.
సాధారణంగా వైరల్ కళ్లకలక ఒక కంటికే వస్తుంటుంది. దీన్ని తాకిన చేతిని మరో కంటికి తగలకుండా చూసుకుంటే రెండో కంటికి అంటుకోకుండా కాపాడుకోవచ్చు.
కళ్లకలక గలవారిని కళ్లను చూస్తే తమకూ అంటుకుంటుందని కొందరు భావిస్తుంటారు. ఇది నిజం కాదు. చేతులతో లేదా నీటితో వైరస్ కళ్లకు అంటుకుంటే తప్ప కళ్లకలకు సోకదు. కాబట్టి... ఈ సీజన్ ముగిసేవరకు ప్రజలు కనీస జాగ్రత్తలు పాటిస్తే... ఈ వ్యాధి సోకకుండా ఎవరికి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos