వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించినప్పటికీ... గుంటూరు, కృష్ణా, బాపట్ల, ఏలూరు, అల్లూరి, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారిందని... మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. తెలంగాణకు కూడా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంగర్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జులై లో కురిసిన వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వాగులూ వంకలు పొర్లి... ప్రాజెక్టులన్నీ నీటికుండల్లా మారాయి. కానీ ఆగస్టులో మూడువారాలు పూర్తయినా... చినుకు జాడే లేకుండా పోయింది. తాజాగా అల్పపీడన ప్రభావంతో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos