తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదించక పోవడంతో ... ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ముట్టడించిన  నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చర్చలకు రావాలని రాజ్ భవన్ ఆహ్వానించింది. ప్రస్తుతం తమిళిసై పుదుచ్చేరిలో ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో తమిళిసై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగడం తనను బాధించిందని ... కార్మికులకు తాను వ్యతిరేకిని కాదని ఆమె ట్వీట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళన కార్యక్రమాలతో సామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని అన్నారు.  గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సమయంలో కూడా తాను వారికి అండగా నిలిచానని ... తాను ఎప్పుడూ కార్మికులకు అండగానే ఉంటానని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును ప్రస్తుతం తాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని... ఆర్టీసీ కార్మికుల హక్కులకు ఏమాత్రం అన్యాయం జరగకూడదనేదే తన ఉద్దేశమని చెప్పారు. దీంతోపాటు 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ఓ పత్రికలో వచ్చిన వార్తను కూడా ఆమె షేర్ చేశారు.  కాగా... ఈ బిల్లుకు సంబంధించి మొత్తం ఐదు అంశాలపై గవర్నర్... ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఈ ఐదు అంశాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరోవైపు ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్‌ ఆమోదం తెలపకపోవడంతో టీఎస్ఆర్టీసీ బంద్‌కు పిలుపునిచ్చింది. శనివారం ఉదయం రెండు గంటల పాటు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ఎక్కడికక్కడ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. గవర్నర్ వద్ద ఆర్టీసీ బిల్లు క్లియరెన్స్‌పై కార్మికులతో ప్రభుత్వం డ్రామాకు తెరలేపింది. గవర్నర్ రాజకీయ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. డిపోల ముందు రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos