ప్రపంచవ్యాప్తంగా... ఇటీవల రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాకు ఎన్నో కాంప్లిమెంట్లు వచ్చినా... అంతకుమించిన కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. అదేవిధమైన కామెంట్స్... గాసిప్స్ తాజాగా మరో టాలీవుడ్ చిత్రానికి కూడా లెక్కలేనన్ని వస్తున్నాయి. ఆ చిత్రం ఏమిటో తెలుసా... సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం.  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఈరోజు వరకు కూడా షూటింగ్ ఏకధాటిగా జరగలేదు.

ఏ సినిమాపై రానన్ని గాసిప్స్ ఈ చిత్రంపై వస్తున్నాయి. రోజుకొకటి పుట్టుకొస్తోంది. నటుల కాల్షీట్లు దొరకడంలోనూ ఈ సినిమాకు కష్టాలే ఎదురవుతున్నాయి. వారి కాల్షీట్లు దొరక్క షూటింగ్ వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇంతలోనే ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు తమన్ ను తొలగించారంటూ వార్త వచ్చింది అయితే గుంటూరు కారం యూనిట్ దీన్ని ఖండించింది. ఈ వార్తను మరిచిపోయేలోగా మరో వార్త హల్ చల్ చేస్తోంది. పూజాహెగ్డేను తొలగించారంటూ మరో వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. పూజా హెగ్డేను తొలగించి సంయుక్త మీనన్ కు అవకాశం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.

దీనిపై అటు చిత్ర యూనిట్ కానీ... ఇటు పూజా హెగ్డే టీమ్ కానీ.. స్పందించలేదు. ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. విరూపాక్ష సినిమాలో సత్తా చాటిన సంయుక్త మీనన్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ... ఈ సినిమా ఉందా? అటకెక్కించావా? అంటూ బండ్ల గణేష్ పరోక్షంగా త్రివిక్రమ్ గురించి ట్వీట్ చేయడం కూడా మహేష్ బాబు అభిమానుల్లో ఆందోళన పెరగడానికి కారణమైంది. మొత్తానికి గుంటూరు కారం సినిమా... విడుదలకు ముందే కారం ఘాటు రేపుతోంది. విడుదల తరువాత ఇంకెంత కారం మంట వెదజల్లుతుందో చూడాలి.

 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos