రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నేడు... టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు నివాళి అర్పించారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్మరించుకున్నారు. చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ అని కొనియాడారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆత్మీయుడు హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. 2018 ఆగస్ట్ 29న 61 ఏళ్ల హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు కారులో వెళ్తుండగా నార్కట్ పల్లి వద్ద టయోటా ఫార్చ్యూనర్ కారు రోడ్డు ప్రమాదానికి గురయింది. ఆ సమయంలో కారును హరికృష్ణ స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు. కారు అత్యంత వేగంగా వెళ్తున్న సమయంలో వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఆయన వెనక్కి తిరిగారు. ఈ క్రమంలో అదుపుతప్పి కారు ప్రమాదం జరగడంతో ఆయన కన్నుమూశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
లోకేశ్ కూడా ఈ సందర్భంగా నివాళులర్పించారు. తన మామయ్య హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా యువనేత గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..  మా హ‌రి మామయ్య నిబద్ధతకు, నిజాయితీకి నిలువెత్తు రూపమని... దూకుడు ఆయ‌న నైజం, కోపం తాత్కాలికం, ప్రేమ శాశ్వతం... మేన‌ల్లుడిగా ఆయ‌న ఆత్మీయ‌త పొంద‌డం నా అదృష్టమని పేర్కొన్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా చేప‌ట్టిన ప‌ద‌వుల‌కే వ‌న్నెతెచ్చిన నంద‌మూరి హ‌రికృష్ణ లేనిలోటు ఎవరూ తీర్చలేనిదని... హ‌రి మామయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos