సుమారు ఆరేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమా గుర్తుందా... విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. 2016లో విడుదలైన ఈ అనువాదచిత్రం తమిళంలో కంటే కూడా తెలుగులోనే సూపర్ సక్సెస్ అయింది. అదే ఏడాది నోట్ల రద్దు జరగడం... ఈ సినిమాలో ఓ బిచ్చగాడు.. 500, 1000 నోట్లను రద్దు చేయమని సూచించడం అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. నోట్ల రద్దును బిచ్చగాడు ముందుగానే అంచనా వేశాడంటూ మీమ్స్ హల్ చల్ చేశాయి. సరే... ఈ సినిమా కథ పక్కన పెడితే... నిజజీవితంలో ఒక బిచ్చగాడు బిచ్చమెత్తుకుంటూ ... కోట్ల రూపాయలు సంపాదించాడంటే మీరు నమ్ముతారా... మీరు నమ్మినా... నమ్మకపోయినా... ఇది నిజంగా జరిగింది. ఇది ఎక్కడో... ఏ దేశంలోనో కాదు... మన భారతదేశంలోనే... ప్రధాన నగరమైన ముంబయ్ లో వెలుగులోకి వచ్చింది. ఈ బిచ్చగాడి పేరు భ‌ర‌త్ జైన్‌. ఇంత‌కీ ఇత‌ని మొత్తం ఆస్తి ఎంతో తెలుసా.. అక్ష‌రాలా 7 కోట్ల 50 ల‌క్ష‌ల రూపాయ‌లు. ప్ర‌పంచంలోని బిచ్చ‌గాళ్ల‌లో భ‌ర‌త్ జైనే సంప‌న్నుడు. భిక్షాటన ద్వారా నెలకు రూ.60 వేల నుంచి 75 వేల వరకు ఆర్జిస్తూ, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన బిచ్చగాడిగా గుర్తింపు పొందాడు. ఇతనికి ముంబయిలో పలుచోట్ల ఆస్తులు ఉన్నాయి. భార్య, ఇద్దరు కుమారులు, తండ్రి, ఓ సోదరుడు ఉన్నారు. జైన్ కు ముంబయిలో రూ.1.2 కోట్ల విలువైన ఓ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఉంది. థానేలో అతనికున్న రెండు షాపుల ద్వారా నెలకు రూ.30 వేల ఆదాయం అద్దె రూపంలో అందుతోంది. దాంతో పాటు బిచ్చమెత్తుకుంటూ రోజుకు 2000 రూపాయల నుంచి 2500 వరకు ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం భరత్ జైన్ కుటుంబం ముంబయిలోని పరేశ్ ప్రాంతంలో ఓ డూప్లెక్స్ ఇంటిలో నివాసం ఉంటోంది. అతడి పిల్లలు స్థానిక కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. మిగతా కుటుంబసభ్యులు స్టేషనరీ షాపు నడుపుతున్నారు. యాచక వృత్తి మానేయమని కుటుంబసభ్యులు ఎంత చెప్పినా భరత్ జైన్ వినడం లేదు. తనను ఇంతవాణ్ని చేసిన ఈ వృత్తిని వదిలేది లేదంటూ నిరాకరిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల జైన్ చిన్నతనంలో చదువుకోలేకపోయాడు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో వీధుల్లో భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీసుకొచ్చాడు. క్రమంగా దాన్నే వృత్తిగా మలచుకున్నాడు. పిల్లలు తనలా మారకూడదనే ఉద్దేశంతో వారిని పెద్ద స్కూల్లో చదివిస్తున్నాడు. ఇలాంటి వాస్తవ గాథలను చూసేనేమో బిచ్చగాడు లాంటి సినిమాలు వస్తున్నాయి. సో.. బిచ్చగాడని చిన్నచూపు చూడొద్దండి... ఎందుకంటే... వాళ్లే ఇతరులకు బిచ్చమేసే స్థాయికి ఎదిగారు మరి. అంతా కాలమహిమ. అదండీ సంగ‌తి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos