తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి భారీ విరాళం అందింది. లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ ... తిరుమల శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన సేవకు ఉపయోగించే 108 బంగారు పుష్పాలను విరాళంగా ఇచ్చారు.. బుధవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో పాల్గొన్న కిరణ్, దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డికి కోటి యాభై లక్షల విలువ చేసే 108 బంగారు పుష్పాలను అందజేశారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అందించగా, ఈవో ధర్మారెడ్డి లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ ను పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులు పోటెత్తుతున్నారు. సర్వదర్శనాలను అనుమతిస్తుండడం, కాలినడకన వచ్చే వారి సంఖ్య కూడా పెరగడంతో.. సప్తగిరులు కిక్కిరిసిపోతున్నాయి. శ్రీవారి దర్శనానికి గంటల పాటు భక్తులు వేచిఉండాల్సి వస్తోంది. ఇక సెప్టెంబర్‌లో స్వామివారి విశేష ఉత్సవాలను నిర్వహించబోతోన్నారు టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలలో శ్రీవారికి విశేష ఉత్సవాలను నిర్వహించనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos