స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సీజేఐ బెంచ్‌కు చేరిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. జస్టిస్ భట్టి, ఖన్నా బెంచ్ వేరే బెంచ్‌కు బదిలీ చేయడంతో ఆయన సీజేఐని ఆశ్రయించి... తక్షణమే లిస్టింగ్ చేయాలని కోరారు. త్వరగా లిస్ట్ చేయాలన్నదే తమ మొదటి అభ్యర్ధన అని... మధ్యంతర ఉపశమనం కలిగించాలన్నది రెండో అభ్యర్థన అని సిద్ధార్థ లూథ్రా తెలిపారు. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని అన్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న చీఫ్ జస్టిస్.. ఈ పిటిషన్‌ విచారణను వచ్చే మంగళవారానికి అంటే అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేశారు. ధర్మాసనంలో ఉన్న తన సహచర జడ్జి ఎస్‌వీ భట్టి ఈ పిటిషన్‌ ను విచారించడానికి సిద్ధంగా లేరని మరో జడ్జి ఖన్నా తెలిపారు. అయితే చంద్రబాబు తరఫున కేసు వాదిస్తున్న హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూద్రా ఈ పిటిషన్‌ ను వెంటనే విచారించాలని కోరారు. అయితే వచ్చే వారం చూద్దామని.. సహచర జడ్జి ఎస్‌వీ భట్‌.. ఈ పిటిషన్‌ పై విచారించడానికి 'నాట్‌ బిఫోర్‌ మి' అంటున్నారని జస్టిస్‌ ఖన్నా తెలిపారు. ఈ నేపథ్యంలో సిద్థార్థ లూద్రా ఈ పిటిషన్‌ ను త్వరగా విచారించాలని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. అయితే ఆయనను మీరు కలవడానికి ఇబ్బంది లేదని.. తాను మాత్రం కేసును వాయిదా వేస్తున్నానని జస్టిస్‌ ఖన్నా స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ పై విచారణను వాయిదా వేస్తూ... వచ్చే వారం వింటామని తెలిపారు. ఈ పిటిషన్‌ ను విచారించడానికి నా సహచర జడ్జి భట్‌ సిద్ధంగా లేరు కాబట్టి మరో జడ్జితో విచారిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో అక్టోబర్‌ 2 తర్వాతే విచారణకు రానుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos