టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్వ్కాష్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరుగనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును అరెస్టు అయి... రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తనపై నమోదు చేసిన స్కిల్ కేసును కొట్టివేయాలని చంద్రబాబు ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. అందుకు హైకోర్టు నిరాకరించడంతో... చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైనే ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందుకు రానుంది. స్వ్కాష్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు గత నెలలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ వివిధ కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. తొలుత సెప్టెంబరు 26న ఈ పిటిషన్ విచారణ చేయాల్సి ఉండగా... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో క్యురేటివ్ పిటిషన్‌లపై స్పెషల్ బెంచ్ సమావేశం అయినందున ఆ రోజు లిస్ట్ అయిన పిటిషన్ల విచారణ వాయిదా పడింది. అందులో చంద్రబాబు పిటిషన్ కూడా ఉండటంతో సెప్టెంబరు 27 కి వాయిదా పడింది. ఆ రోజు తొలుత ఈ పిటిషన్ ద్విసభ్య ధర్మాసనం ముందుకు రాగా, వారిలో ఓ న్యాయమూర్తి ఈ కేసు వినేందుకు సుముఖత చూపలేదు. ‘నాట్ బిఫోర్ మీ’ అని చెప్పడంతో మరో బెంచ్ కు బదిలీ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ పిటిషన్ పై విచారణ అక్టోబరు 3కి అంటే ఈ రోజుకు వాయిదా పడింది. ఇదిలావుండగా... ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేస్తూ... చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని కోరింది. స్కిల్‌ స్కామ్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయని ... విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, నిధులను షెల్‌ కంపెనీల ద్వారా రూటు మళ్లించారని పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాంపై దర్యాప్తు స్టార్ట్ చేశాయని తెలిపింది. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీనే అని పేర్కొంటూ ... ఈ కేసులో తమ వాదనలను వినిపిస్తామని కేవియట్ పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos