తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఈ తాకిడి ఎక్కువగా ఉంది. ఇవి అతి భారీ వర్షాలుగా మారి, ఐదురోజులపాటు కుండపోత తప్పదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగతా జలపాతం పొంగి పొర్లుతోంది. ఛత్తీస్ గఢ్ తో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో వరదలు ఎక్కువ అయ్యాయి. దీంతో బొగతా జలపాతం వద్ద పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. నిండుకుండలా మారి పొంగి పొర్లుతున్న గంగమ్మను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. జలపాతాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా... వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో జలపాతం సందర్శనను నిలిపి వేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా... ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.
కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ... ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వీటితోపాటు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాభాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు ఎక్కడికక్కడ సమీక్షలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించి... అప్రమత్తం చేశారు. మరోవైపు...  భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం 168 అత్యవసర బృందాలను రంగంలోకి దించింది. ఇందులో 64 మొబైల్‌, 104 మినీ మొబైల్‌ బృందాలు, 160 స్టాటిక్‌ లేబర్ టీమ్స్‌ ఉంటాయి. మొబైల్‌, మినీ మొబైల్‌ ఎమర్జెన్సీ టీమ్‌ లకు ... అధికారులు... షిప్టుల వారీగా కార్మికులను కేటాయించారు. ప్రతి చెరువుకు ఒక ఇన్‌ చార్జి, ఇద్దరు పర్యవేక్షకులను నియమించారు. వరద అంచనాను బట్టి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జోన్ల వారీగా వరద ప్రభావిత ప్రాంతాలకు ఇన్‌ చార్జిలను నియమించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos