హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో ఆయన లంచం ఇవ్వాల్సి రావడంతో ... ఆయన మనస్తాపం చెంది కేంద్రప్రభుత్వానికి ట్వీట్ చేశారు. ఆ సినిమా సెన్సార్ కోసం దాదాపు రూ. 6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన ట్వీట్ చేశారు. తాను ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, మరో దారిలేక డబ్బులివ్వాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తుల్లో ఏ నిర్మాతకూ ఇలా జరగకూడదని విశాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేశారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీంతో విశాల్ స్పందిస్తూ.... సెన్సార్ బోర్డ్ ముంబై కార్యాలయంలో జరిగిన అవినీతి విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు మీరు తీసుకునే చర్యలు.. అవినీతికి పాల్పడాలనుకునే ప్రభుత్వ అధికారుల్లో భయాన్ని నింపుతాయని ఆశిస్తున్నానని... అలాగే లంచాలు తీసుకోకుండా నిజాయితీగా వారు దేశానికి సేవలు చేసేందుకు ఈ చర్యలు దోహదపడతాయని నమ్ముతున్నానని విశాల్ పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos