ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వెనుక ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ పిల్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం... సీఎం వైఎస్ జగన్ తో పాటు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిల్ కు విచారణార్హత లేదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించినా హైకోర్టు మాత్రం నోటీసులు జారీ చేసింది. రఘురామ కృష్ణంరాజు తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ దాఖలు చేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులు ధ్వంసం చేసిందని కోర్టుకు విన్నవించారు. సీఎం జగన్ తనకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారని అన్నారు. ఇసుక, మద్యం, ఆరోగ్య శాఖకు కొనుగోలు చేసిన కొన్ని పరికరాలు, సిమెంట్ కొనుగోలు వ్యవహారంలో బంధువులు, అనుకూలురుకు లబ్ధి చేకూర్చారని పేర్కొన్నారు. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం సీఎంతో సహా 41 మందికి నోటీసులు ఇచ్చింది. ప్రతివాదుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం ఈ పిల్ పై విచారణను వచ్చే నెల 14కి వాయిదా వేసింది. మరోవైపు ... సీఎం జగన్ ఆస్తుల కేసు విచారణ పదేళ్లుగా నత్తనడకన సాగుతోందని, అందుకే హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలంటూ  సీబీఐకి నోటీసులు జారీ చేసింది. రఘురామ వేసిన బదిలీ పిటిషన్ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ధర్మాసనం పేర్కొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos